మన తెలుగులో స్టార్ హీరోలకు ఉండే డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వారి సినిమాల కోసం ప్రేక్షకులు ఏ స్థాయిలో ఎదురు చూస్తారు వారి తో కలిసి పని చేయడానికి సినిమా చేయడానికి మన తెలుగులో దర్శక నిర్మాతలు ఏ విధంగా ఎదురు చూస్తారు అనేది అందరికి తెలిసిందే. ఇక ఇది  పక్కన పెడితే ఇప్పుడు మన తెలుగు హీరోలకు ఇబ్బందికర వాతావరణం ఉందని అంటున్నారు. హీరోలకు భారీగా పారితోషికం తగ్గించే ఆలోచనలో ఉన్నారు నిర్మాతలు అని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. దాదాపు అగ్ర హీరోలు అందరికి కూడా పారితోషికం తగ్గించే అవకాశం ఉందని అంటున్నారు. 

 

చిన్న హీరోలకు అయితే సగానికి సగం తగ్గించే సూచనలు ఉన్నాయి అనేది టాలీవుడ్ జనాల మాట. చాలా మంది నిర్మాతలు ఇప్పుడు నష్టాలతో సావాసం చేస్తున్నారని ఇప్పుడు హీరోలకు భారీగా పారితోషికం ఇస్తే తాము నష్టపోయే అవకాశాలు ఉన్నాయని నిర్మాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దయచేసి తమ బాధను హీరోలు అర్ధం చేసుకుని ఎక్కువగా డిమాండ్ చేయవద్దు  తర్వాత తర్వాత తామే ఇస్తామని అడిగే అవకాశాలు ఉన్నాయని ఇప్పుడు వార్తలు వస్తున్నాయి. ఇక మన తెలుగులో అగ్ర హీరోలు అందరూ కూడా ఇప్పుడు చాలా బిజీ గా ఉన్నారు. 

 

దాదాపు అందరు హీరోలు కూడా వరుస సినిమాలను చేస్తున్నారు. ప్రభాస్ ఎన్టీఆర్ రామ్ చరణ్ ఇలా ప్రతీ ఒక్కరు కూడా సినిమాల విషయంలో ఇప్పుడు కాస్త దూకుడుగానే వెళ్తున్నారు అనే విషయం స్పష్టంగా అర్ధమవుతుంది. అగ్ర హీరోలు సినిమాల కోసం ఇప్పుడు అభిమానులు కూడా ఎంతో ఆశగా ఎదురు చూసే పరిస్థితి ఉంది అనేది వాస్తవ౦. ఎక్కడా కూడా ఇప్పుడు సినిమాలు విడుదల అయ్యే అవకాశం లేదు. సినిమాలు విడుదల కావాలి అంటే కచ్చితంగా ఏడాది పట్టే అవకాశాలు ఉన్నాయని కూడా అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: