ఇప్పుడు దేశ వ్యాప్తంగా సినిమాల షూటింగ్ కి గ్రీన్ సిగ్నల్ వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి ఇతర రాష్ట్రాల్లో షూటింగ్ కి అనుమతులు వచ్చినా రాకపోయినా ఏ రాష్ట్రం వాళ్ళను ఆ రాష్ట్రంలో షూటింగ్ కి అనుమతి ఇచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా సినిమా షూటింగ్ కోసం ఎందరో ఎదురు చూస్తున్నారు. ఎందరో రోడ్డున పడి ఉపాధి లేక నానా కష్టాలు పడుతున్నారు ఆదుకునే వాళ్ళు లేక సిని కార్మికుల ఇబ్బందులు అన్నీ ఇన్ని కావు. ఇక ఇప్పుడు సినిమాల షూటింగ్ మొదలుపెట్టే అవకాశాలు కనపడుతున్నాయి. 

 

అయితే ఇక్కడ సినిమాల షూటింగ్ విషయంలో కొన్ని జాగ్రత్తలను తీసుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అది ఏంటీ అనేది ఒకసారి చూస్తే సినిమాల షూటింగ్... కి ఇప్పుడు కొందరు కార్మికులను మాత్రమే అనుమతి ఇవ్వాలని ఇతర రాష్ట్రాలకు చెందిన కార్మికుల కు అనుమతి ఇవ్వొద్దు అని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భావిస్తున్నాయి. దీనితో ఇప్పుడు గోదావరి జిల్లాల్లో ఉండే సినీ కార్మికులు బాగా ఇబ్బంది పడే అవకాశాలు కనపడుతున్నాయి. వాళ్ళు చాలా మంది ఇప్పుడు సినిమాల షూటింగ్ లేకపోవడం తో సొంత ఊర్లకు వెళ్ళిపోయారు. 

 

ఇప్పుడు వాళ్ళు అందరూ మల్లి హైదరాబాద్ వెళ్ళడం దాదాపుగా సాధ్యం కాదని పలువురు వ్యాఖ్యలు చేస్తున్నారు. దీనితో వారి విషయంలో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వా లు ఒకటికి పది సార్లు ఆలోచన చేసి నిర్ణయం తీసుకోవాలని చూస్తున్నారు. ప్రస్తుతం చిరంజీవి ఇదే విషయాన్ని తెలంగాణా ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్ళారని కేసీఆర్ నుంచి సానుకూలంగా సమాధానం వచ్చింది అని  అంటున్నారు. దీనిపై త్వర లోనే తెలంగాణా ప్రభుత్వం నుంచి స్పష్టత వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. ఇక ఇప్పుడు ఏ సినిమాల షూటింగ్ ని ముందు మొదలు పెడతారు అనేది స్పష్టత రావడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: