సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల అన‌గానే వెంట‌నే మంచి ఫీల్ గుడ్ చిత్రాలే గుర్తుకు వ‌స్తాయి. శేఖర్ కమ్ముల సినిమాలలో అనుబంధాలు పెనవేసుకునేలా పాత్రల చిత్రీకరణ ఉంటుంది. ఆయ‌న ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ‘ఆనంద్‌’ ‘గోదావ‌రి’ ‘హ్యాపీడేస్‌’ ‘ఫిదా’ చిత్రాలు ఎంత‌టి ఘ‌న విజయాల‌ను సొంతం చేసుకున్నాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. శేఖర్ కమ్ముల ప్రస్తుతం అక్కినేని నాగచైతన్య - సాయి పల్లవి హీరో హీరోయిన్లుగా 'లవ్ స్టోరీ' అనే సినిమాని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఏసియన్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఈ సినిమాతో ఫస్ట్ టైమ్ నిర్మాణ రంగంలోకి దిగుతోంది. కాగా నారాయణదాస్ నారంగ్, ఎఫ్.డి.సి చైర్మైన్ రామ్మోహనరావు ఈ చిత్రానికి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. సున్నితమైన ప్రేమ కథా చిత్రాలని తనదైన స్టైల్ లో తెరకెక్కించే శేఖర్ కమ్ముల.. 'మజిలీ', 'వెంకీమామ' వంటి వరుస విజయాలతో దూకుడు మీదున్న నాగచైతన్యతో కలిసి మరో లవ్ స్టోరీని మన ముందుకు తీసుకొస్తున్నాడు. 'ఫిదా' లాంటి సెన్సేషనల్ హిట్ సినిమా తర్వాత రెండేళ్ల గ్యాప్ తీసుకుని శేఖర్ కమ్ముల తీస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇదిలా ఉండగా శేఖర్ కమ్ముల నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి టాలీవుడ్ వర్గాల్లో చర్చించుకుంటున్నారు.

 

తాజా సమాచారం ప్రకారం 'లవ్ స్టోరీ' మూవీ తర్వాత శేఖర్ కమ్ముల తన నెక్స్ట్ మూవీ కూడా ఏషియన్ వారికే చేయనున్నాడట. ఈ సినిమాలో ఓ పెద్ద హీరో నటించబోతున్నాడని.. ఆల్రెడీ స్టోరీ డిస్కషన్స్ స్టార్ట్ అయ్యాయని సమాచారం. అయితే ఈ సినిమాలో ఆ స్టార్ హీరో ఎవరనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. అయితే ఇప్పుడు స్టార్ హీరోలందరూ బిజీగా ఉన్నారు. మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్, బాలయ్య, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్.. ఇలా స్టార్ హీరోలందరూ బిజీగా ఉన్నారు. కానీ కింగ్ నాగార్జున మాత్రం 'వైల్డ్ డాగ్' సినిమా చిత్రీకరణ చివరి దశలో ఉన్నా నెక్స్ట్ ప్రాజెక్ట్ విషయంలో ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో శేఖర్ కమ్ముల - కింగ్ నాగ్ కాంబో సెట్ అవ్వబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి. నాగార్జున కూడా ఎప్పటి నుండో శేఖర్ కమ్ములతో సినిమా చేయాలని ఎదురు చూస్తున్నాడు. ఈ విషయాన్ని కింగ్ పలు సందర్భాల్లో వెల్లడించాడు కూడా. అందులోనూ నాగ చైతన్యతో సినిమా చేస్తున్న కమ్ముల శేఖర్ అతని తండ్రి నాగార్జునని కూడా డైరెక్ట్ చేయబోతున్నాడనే వార్తలు ఊపందుకున్నాయి. మరి ఈ వార్తల్లో నిజమెంత ఉందో తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: