ఆర్ఆర్ఆర్... ఇప్పుడు ఈ సినిమా టాలీవుడ్ లో ఒక సంచలనం  అనే చెప్పుకోవాలి. ఈ సినిమాకు సంబంధించి ఏ వార్త వచ్చినా సరే జనాలు ఎంతో ఆసక్తిగా చదువుతున్నారు. ఈ సినిమా ఎప్పుడు ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తుందా ? అని యావ‌త్ ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు అంద‌రూ ఎంతో ఆస‌క్తితో వెయిటింగ్‌లో ఉంటే ద‌ర్శ‌కుడు రాజ‌మౌళీ యేమో సినిమాను ప‌దే ప‌దే వాయిదా వేస్తూ వ‌స్తున్నారు. ఇక ఇప్పుడు దీనికి తోడు క‌రోనా కూడా రావ‌డంతో అస‌లు ఆర్.ఆర్.ఆర్ ఎప్పుడు వ‌స్తుందో ?  కూడా తెలియ‌ని ప‌రిస్థితి.

 

ఇప్పుడు ఈ సినిమాలో నటిస్తున్న జూనియర్ ఎన్టీఆర్ , రామ్ చరణ్ కి బాలీవుడ్ లో కూడా మంచి గుర్తింపు అనేది వచ్చింది. ఇక ఈ సినిమాలో నటించే నటుల గురించి కూడా టాలీవుడ్ లో పెద్ద చర్చలే జరుగుతున్నాయి ఇప్పుడు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే దాదాపుగా పూర్తి అయింది. కీలక సన్నివేశాలకు సంబంధించి త్వరలోనే షూటింగ్ ఉండే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. ఇక త్వరలోనే ఎన్టీఆర్ లుక్ ని కూడా విడుదల చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది. 

 

ఇది పక్కన పెడితే ఈ సినిమా ద్వారా తన కొడుకులను పరిచయం చేసే ఆలోచనలో ఎన్టీఆర్‌ ఉన్నాడని తెలుస్తుంది. ఒక్క నిమిషం సన్నివేశంలో ఇద్దరినీ చూపించే అవకాశం ఉందని సమాచారం. జక్కన్న తో దీనికి సంబంధించి ఇప్పటికే ఎన్టీఆర్‌ మాట్లాడగా అందుకు ఓకే కూడా చెప్పారని, ఈ విషయాన్నీ చిత్ర యూనిట్ అధికారికంగా కూడా ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. తన కెరీర్ లో తాను అత్యంత ప్రతిష్టాత్మక సినిమా చేస్తున్నా అని కాబట్టి తన కొడుకులను సినిమాలో చూపించాలి అని ఎన్టీఆర్ భావిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమాలో వాళ్ళు ఇద్దరూ కూడా ఎన్టీఆర్ కొడుకులుగా నటిస్తారని సమాచారం.

 

మరింత సమాచారం తెలుసుకోండి: