సినిమా షూటింగ్ పూర్తయ్యాక రిలీజ్ పోస్టర్ వేయడం అతి సహజమైన విషయం. కానీ అదే ఓ సినిమా రిలీజ్ పోస్టర్ పై నేడే విడుదలతో పాటు ఈ సినిమా శతదినోత్సవం పలానా రోజున జరిగుతుంది అని వేయాలంటే చాలా గట్స్ కావాలి. అలాంటి పోస్టర్ బహుశా ఏ డైరక్టర్ కూడా వేసే ధైర్యం చేయడు. కానీ.. ఎంతో ధైర్యంగా అలా పోస్టర్ వేసిన తెలుగు దర్శకుడు వైవీఎస్ చౌదరి. అలా వేసిన సినిమా ‘లాహిరి లాహిరి లాహిరిలో..’ సినిమాకు. ఈరోజు వైవీఎస్ చౌదరి పుట్టినరోజు.

IHG

హరికృష్ణ, సుమన్, వినీత్, లక్ష్మీ, ఆదిత్య ఓం, భానుప్రియ, సంఘవి, రచన, జయప్రకాశ్ రెడ్డి.. వంటి భారీ క్యాస్టింగ్ తో ఈ సినిమా తీశాడు వైవీఎస్ చౌదరి. సినిమా ఆద్యంతం ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. రెండు కుటుంబాల మధ్య పోరుకు అందమైన ప్రేమకథను జోడించి ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కించాడు వైవీఎస్. సినిమా రిలీజ్ పోస్టర్ లోనే ‘నేడే విడుదల’ అని.. ‘ఈ సినిమా శతదినోత్సవం ఆగష్టు రెండో వారం గుడివాడలోని ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతాయి’ అని వేశాడు వైవీఎస్. ఇది చాలా డేరింగ్ డెసిషన్ అని చెప్పాలి. కానీ.. వైవీఎస్ కు సినిమాపై ఉన్న నమ్మకం నిజమైంది. ఈ సినిమా నిజంగానే సూపర్ హిట్ అయి శతదినోత్సవం జరుపుకుంది.

IHG

 

బొమ్మరిల్లు బ్యానర్ పై స్వీయ నిర్మాణంలో వైవీఎస్ ఈ సినిమా తెరకెక్కించాడు. ఈ సినిమా విజయంలో సంగీతం పాత్ర ప్రధానం. కీరవాణి అందించిన పాటలన్నీ సూపర్ హిట్టే. గోదావరి జిల్లాల్లోని అందమైన లోకేషన్లో ఈ సినిమాను తెరకెక్కించాడు వైవీఎస్. తాను శిష్యరికం చేసిన రాఘవేంద్రరావు పుట్టినరోజునే వైవీఎస్ పుట్టినరోజు కూడా కావడం యాధృచ్చికం. పలు విజయవంతమైన సినిమాలు తెరకెక్కించిన వైవీఎస్ ప్రస్తుతం కొంత విరామం ఇచ్చాడు.

IHG

మరింత సమాచారం తెలుసుకోండి: