IHG

తెలుగు సినీ ప్రరిశ్రమలో ఎవరికి ఏ అవసరం వచ్చిన ముందుగా అయన ఉన్నారు అని అనిపించే భరోసా మెగాస్టార్ చిరంజీవి. అయన రీల్ లైఫ్ లోనే కాకుండా రియల్ లైఫ్ లో కూడా గొప్ప మనసున్న మహారాజు, తెలుగు ప్రరిశ్రమ హైదరాబాద్ కు రావడానికి కృషిచేశారు చిరంజీవి. తెలుగు సినీ ఆర్టిస్ట్ ల ఐక్యత కోసం MAA ని సృష్టించి ..ఇండస్ట్రీలో ప్రతి అట్టడుగు స్థాయి కార్మికుడికి తనవంతు సాయం చేయడం అయన స్పెషలిటీ. కేవలం ఇండస్ట్రీ గురించే కాకుండా తన అభిమానులకోసం మరియు తెలుగు రాష్ట్రాల ప్రజలకోసం ఎన్నో సహాయకార్యక్రమాలను చేసిన గొప్ప వ్యక్తి. తెలుగు రాష్ట్రాలలో మరియు ఇతర భారత రాష్ట్రాలలో ఏ విపత్తు వచ్చినా ముందుగా వినిపించే గళం చిరంజీవి గారిది. చిరంజీవిగారి జీవితంలో సామాన్యమానవుడికి కూడా తెలియని గొప్పవ్యక్తి దాగి వున్నాడు. ఇండిస్టీలో అయన సహాయం కోరి ఎవరు ఉత్తచేతులతో వెనుతిరిగి వెళ్ళింది లేదు. 

IHG
తమిళ ప్రరిశ్రమలో మాస్ హీరోగా పేరొందిన నటుడు శరత్ కుమార్ . అయన స్వయానా తెలుగులో అగ్రకథానాయిక గా వెలిగిన రాధికా గారి భర్త . తాజాగా లాక్ డౌన్ సందర్భంగా జరిగిన ఓ టీవీ ప్రత్యేక్ష ప్రసారంలో శరత్ కుమార్ గారు చిరంజీవి గారి మంచితనాన్ని గురించి పంచుకున్నారు. జగదేకవీరుడు అతిలోక సుందరి సినిమా రిలీజ్ అయ్యి 30 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భం చిరంజీవి గారు తన సోషల్ మీడియా ద్వారా పంచుకున్న వీడియో గురించి ఓ టీవీ ఛానల్ చేసిన ప్రత్యేక ఇంటర్వ్యూలో శ్రీమతి రాధికా శరత్ మరియు శరత్ కుమార్ లు చిరంజీవి గారితో వారికున్న అనుబంధాన్ని పంచుకున్నారు. తమిళంలో శరత్ కుమార్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తన కెరీర్ కొనసాగుతున్న టైం లో కొన్ని ఆర్ధికంగా అప్పుల పాలు కావడంతో ఏమి దిక్కుతోచని స్థితిలో ఉన్న నాకు చిరంజీవిగారు చేసిన సహాయం మరువలేనిది.

 

 

 

 శరత్ కుమార్ చిరంజీవి గారి గురించి చెబుతూ ... అప్పటికే గ్యాంగ్ లీడర్ , స్టూవర్టుపురం పోలీస్ వంటి చిత్రాలలో కలసి నటించాము. నాకు తెలిసిన ఓ పెద్ద ప్రొడ్యూసర్ చిరంజీవిగారిని నా సినిమాకు ఒప్పిస్తే నీకు అప్పులున్నాయి అంటున్నవ్ కాబట్టి ఆ సినిమా మీద వచ్చే ఆదాయనంత నీకు ఇస్తా అన్నారు. ఆదేవిషయమై చిరంజీవిగారికి కాల్ చేశాను ..అయన కలవడానికి ఒప్పుకున్నారు . ఆయనని ఓ షూటింగ్ జరుగుతుండగా కలుసుకున్నాను ...నన్ను చూసిన అయన కేవలం నాకోసమే ఆ షూటింగ్ కి ప్యాక్ అప్ చెప్పి నన్ను తీసుకుని భోజనానికి వెళ్ళిపోయాడు. ఆరోజు ఒక తల్లిలా నాకు భోజనం తినిపించారు ..భోజనం అయ్యాక నా సమస్య చెప్పను ...నా యొక్క ఆర్ధిక ఇబ్బందులు మరియు ప్రొడ్యూసర్ చెప్పిన విషయం గురించి చెప్పాను ..అంతా కూలంకుషంగా విన్నారు అయన...

 

 

 

చివరిలో మీరు ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటారు అని అడిగాను ..దానికి అయన చిరునవ్వు నవ్వు నవ్వుతు ...నాకు ఏ రెమ్యూనరేషన్ వద్దు ..అది నీకోసం చేస్తున్నాను అన్నారు...ఈ విషయాన్నీ శరత్ స్వయంగా చెబుతూ కన్నీరు పెట్టుకున్నారు. అదేవిధంగా ఆ సినిమా తరువాత నన్ను మీ సినిమాలో చేయడానికి క్యారెక్టర్స్ ని ఇవ్వవలసిందిగా అడిగాను అయితే అయన చిరునవ్వు నవ్వుతు ...నువ్ పెద్ద హీరోవి అయిపోతావ్ ఇందులో ఎటువంటి సందేహం లేదు అప్పుడు  క్యారెక్టర్స్ నువ్వే అందరికి ఇస్తావు అని చెప్పాడు ..అయన చెప్పినట్టే హీరో మరియు ఎన్నో సినిమాలను ప్రొడ్యూస్ చేసే అవకాశం నాకు కలిగింది అంటూ శరత్ ఓ చిన్నపిల్లవాడిలా ..లైవ్ లో ఏడ్చేశాడు ...అవును ఇలాంటి వెలుగు చూడని సహాయాలు  ఎన్నో ...చిరంజీవి గొప్పవాడు అనటానికి ఈ చిన్న సంఘటన చాలదా...

 

మరింత సమాచారం తెలుసుకోండి: