లాక్ డౌన్ దెబ్బకు దేశంలో అన్ని రంగాలు క్లోజ్ అయిపోయాయి. అనుకోని విపత్తు మహమ్మారి కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా విస్తరించడంతో భారత్ లో కేంద్ర ప్రభుత్వం మార్చి నెల నుండి  లాక్ డౌన్ అమలులోకి తీసుకోచ్చింది. దీంతో మార్చి నెలాఖరు నుండి దేశ వ్యాప్తంగా అన్ని సినిమా షూటింగులు బంద్ అయిపోయాయి. విడుదల కావాల్సిన సినిమాలు కూడా ఆగిపోయాయి. వేసవి సందర్భంగా ఇండియాలో సమ్మర్ హాలిడేస్ ని టార్గెట్ చేసి ఇండస్ట్రీలు సినిమాలు రెడీ చేస్తాయి. అయితే ఈసారి కరోనా వైరస్ రావటంతో చాలా వరకు విడుదల కావాల్సిన సినిమాలన్నీ వాయిదా పడ్డాయి. లాక్ డౌన్ దెబ్బకు కొన్ని వేల కోట్ల వ్యాపారం నష్టం వాటిల్లింది సినిమా ఇండస్ట్రీకి.

 

అయితే ఇటీవల లాక్ డౌన్ పొడిగిస్తున్న సమయంలో కొన్ని వాటికి వెసులుబాటు కల్పిస్తూ ఆంక్షలు ఎత్తివేసే సడలింపులు కేంద్రం ఇవ్వటం అందరం చూశాం. రవాణా వ్యవస్థకు అదేవిధంగా వ్యాపారాలకు చాలా వరకు కేంద్రం పర్మిషన్ ఇవ్వడం జరిగింది. దీంతో మార్చి నుండి ఇంటికి పరిమితమైన సినిమా సెలబ్రిటీలు సినిమా షూటింగ్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయో అని ఎదురు చూస్తున్న సమయంలో ఇటీవల  కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. ఈ సందర్భంగా హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ త్వరలోనే దేశవ్యాప్తంగా సినిమా షూటింగులకు అనుమతులు ఇస్తున్నట్లు తెలిపారు. ఇటీవల టాలీవుడ్ ఇండస్ట్రీ ప్రముఖులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జమ్ము కశ్మీర్‌తో సహా దేశం నలువైపులా షూటింగ్‌లు చేసుకునేందుకు త్వరలోనే అనుమతులిస్తామని కిషన్ రెడ్డి తెలిపారు.

 

అంతేకాకుండా దేశవ్యాప్తంగా థియేటర్లు ఒకేసారి ఓపెన్‌ అయ్యేలా నిర్ణయం తీసుకుంటామని కూడా వెల్లడించారు. అంతర్జాతీయ సినిమా పైరసీపై త్వరలోనే మీటింగ్‌ నిర్వహించి పైరసీపై కొత్త చట్టం తీసుకొస్తామని భరోసా ఇచ్చారు. ఓటీటీలో విడుదలయ్యే సినిమాలకు సెన్సార్‌ ఉండేలా ఆలోచన చేస్తున్నామన్నారు. ఇదిలా ఉండగా సినిమా షూటింగ్ ల విషయంలో ఇతర దేశాల నుండి మన దేశానికి వచ్చి నటించే అవకాశం మాత్రం ఇచ్చే ప్రసక్తే లేదు అనే ట్విస్ట్ కేంద్రం ఇచ్చినట్లు సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: