అదేంటో తళుకుబెళుకుల తమన్న ఈ మధ్య ఫైర్ బ్రాండ్ అవుతోందిలా ఉంది. ఆమె గురించే న్యూస్ కూడా బాగా స్ప్రెడ్ అవుతోంది. సినీ ఫీల్డ్ లో పదిహేనేళ్ళు పైగా పాతుకుపోయిన తమన్నా ఇపుడు సరైన టైంలో తన సీనియారిటీని చూపిస్తున్నారని అంటున్నారు. ఈ మధ్యనే తమన్నా తన రెమ్యునరేషన్ పెంచేశారని, భారీగా డిమాండ్ చేస్తున్నారని ప్రచారం జరిగింది.

 

అయితే అదంతా ట్రాష్ అని తాను అలా ఎక్కడా ఎటువంటి డిమాండ్ చేయలేదని తమన్నా ఈ మధ్యనే మళ్ళీ  దానికి వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. అయితే ఆ తరువాత కూడా మళ్ళీ తమన్నావే దానికి మసాలా జోడిస్తున్నారు. తాజాగా తమన్నా అన్నట్లుగా ఒక న్యూస్ మళ్ళీ ప్రచారంలోకి వచ్చింది. అదేంటి అంటే ఎందుకు సినిమా ఫీల్డ్ లో హీరోయిన్ల మీద వివక్ష అంటూ తమన్నా భాటియా కొత్త పాయింటుని తీశారుట. హీరో ఒక సినిమాకు ఎంత ముఖ్యమో హీరోయిన్ కూడా అంతే ముఖ్యమని కూడా ఆమె అంటున్నారు.

 

అటువంటిది హీరోలకు ఎక్కువ రెమ్యునరేషన్ ఇచ్చేసి హీరోయిన్లకు మాత్రం తక్కువ ఇవ్వడం ఏంటని కూడా తమన్నా లాజిక్ పాయింట్ తీస్తున్నారుట. నిజమే కదా అన్ని రంగాల్లో ఆడవారు మగాళ్ళతో సమానంగానే రాణిస్తున్నారు.ఇక సినిమాల్లో చెప్పాలంటే కొత్త సినిమా స్టార్ట్ అయితే హీరోయిన్ ఎవరు అని అడుగుతారు. అంటే హీరోయిన్ మీద అంత ఆసక్తి ఆడియన్స్ కి ఉంటుంది. అలాంటిది హీరోయిన్ గ్లామర్ ని ఫుల్ గా వాడేసుకుని హీరోలకు ఇచ్చే దాంట్లో పదవ వంతు ఇవ్వడం అంటే దారుణమే.

 

ఇప్పటిదాకా ఈ పాయింట్ ఎవరూ లేవనెత్తలేదేమో కానీ తమన్నా  బాగానే అడుగుతున్నట్లుగానే లెక్క. సరే ఇంతకీ ఈ మధ్య తమన్నా నో అన్న సినిమాలు అన్నీ కూడా ఇలా రెమ్యునరేషన్ వద్ద పేచీ  వచ్చి నెట్టేసినవేనా అన్న కొత్త డౌట్లు వస్తున్నాయి మరి నిజమేంటో తమన్నాకే తెలియాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: