ప్రస్తుతం యావత్ ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా మహమ్మారి నుండి ఆరోగ్యంగా బయటపడ్డ ప్రతి ఒక్కరూ వేగంగా కోలుకుంటున్నారు. ప్రతి వందమందిలో దాదాపు 80 మంది చాలా సేఫ్ గా హాస్పిటల్ నుండి డిశ్చార్జి అవుతున్నారు. అంతేకాకుండా ఒకసారి కరోనా వైరస్ సోకిన వారికి వైరస్ వల్ల ఎటువంటి ప్రమాదం ఉండదని డాక్టర్లు కూడా చెప్పారు. వారి శరీరంలో ఉండే యాంటీ బాడీలు మరోసారి వైరస్ వల్ల వారికి ఎటువంటి హాని జరగకుండా చూసుకుంటాను అని స్పష్టం చేశారు.

 

అయితే వైరస్ బారినపడి కోరుకున్న వారికి ఇప్పుడు ఒక కొత్త సమస్య ఇబ్బంది పెడుతోంది. కరోనా నుండి కోలుకున్న చాలా మందిలో మెడనొప్పి ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. విపరీతమైన నొప్పితో వేధించే మెడనొప్పిని యూనివర్సిటీ హాస్పిటల్ ఆఫ్ పీసా వైద్యులు దీన్ని సబ్ 'అక్యూట్ థైరాయిడైటిస్' గా గుర్తించారు.

 

ఇటీవలే వైరస్ బారినపడి డిశ్చార్జి అయిన యువతి ఇంటికి వెళ్ళిన తర్వాత తీవ్రమైన మెడనొప్పి రావడంతో థైరాయిడ్ గ్రంధి వద్ద చాలా నొప్పిగా ఉందని హాస్పిటల్ కు వెళ్ళింది. దానితో పాటు ఆమెకు విపరీతమైన జ్వరం కూడా రావడంతో మళ్లీ ఆమెకు కరోనా ఏమన్నా సోకిందా అని కుటుంబసభ్యులు భయపడ్డారు. దీంతో మరోమారు ఆమెను ఆసుపత్రికి తీసుకువెళ్లగా వైద్యులు ఆమెను పరీక్షించి సబ్ అక్యూట్ థైరాయిడైటిస్ తో ఆమె బాధపడుతున్నట్లు గుర్తించారు.

 

వైరల్ ఇన్ఫెక్షన్లు సోకినవారిలో ఇటువంటి సమస్యలు సహజమని సీనియర్ డాక్టర్ ఫ్రాన్సిస్కో లాట్రోఫా తెలిపారు. వారు కోలుకున్నప్పటికీ ఇన్ఫ్లమేటరీ రియాక్షన్ ( ఆంటే వైరస్ బారిన పడి కోలుకున్న తరువాత వచ్చే ప్రతిచర్యలాంటిది) కారణంగా ఇటువంటి సమస్యలు వస్తుంటాయని తెలిపారు. వైరస్ కారకమైన సార్స్ కోవ్2 కారణంగా ఆమెకు సమస్య వచ్చి ఉంటుందని డాక్టర్ లాట్రోఫా తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: