సూపర్ స్టార్ మహేష్ కెరియర్ లో మురారి సినిమా ఎవర్ గ్రీన్ మూవీ అని చెప్పొచ్చు. క్రియేటివ్ డైరక్టర్ కృష్ణవంశీ డైరక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో మహేష్ సరసన బాలీవుడ్ భామ సోనాలి బింద్రే నటించింది. ఓ చిన్న గొడవతో విడిపోయిన రెండు పెద్ద ఫ్యామిలీలు.. ఆ ఇంటి నుండి వచ్చే ఓ ఆడపడుచు ద్వారా హీరో ఈ ఇంటికి రావడం అక్కడ వసుంధర అదేనండి హీరోయిన్ వసుని చూసి ప్రేమించడం. ముంది గొడవతో వారి పరిచయం ఒకరినొకరు ఇష్టపడేలా చేసుకోవడం జరుగుతుంది. 

 

ఆ సినిమాలో మహేష్, సోనాలిల జోడీ సినిమాకే హైలెట్ అని చెప్పొచ్చు. అంతేకాదు సినిమా స్టోరీ లైన్ కూడా చాలా కొత్తగా ఉంటుంది. ఇక రొమాన్స్ లో కూడా సూపర్ అనిపించాడు కృష్ణవంశీ. మహేష్, సోనాలిల రొమాన్స్ ఈ సినిమాకు బాగా ప్లస్ అయ్యింది. సొనాలిని చూసి అయ్యబాబోయ్ టెంప్ట్ అయిపోతున్నా అంటూ మహేష్ చెప్పే డైలాగ్ సూపర్..మహేష్ ను ఫ్యామిలీ ఆడియెన్స్ కు దగ్గర చేసిన సినిమా మురారి. సినిమాలో మహేష్ నటన కూడా అద్భుతంగా ఉంటుంది. 

 

ప్యూర్ ఎమోషన్స్. ఫ్యామిలీ సెంటిమెంట్, విలనిజం ఇవన్నీ చాలా చక్కగా కుదిరాయి. సినిమాకు హీరో హీరోయిన్ రొమాన్స్ అయితే ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టదు అనేలా ఉంటుంది. ఈమధ్య టివిలో వచ్చిన మురారి సినిమా చూస్తూ ఉంటే అలానే ఉండిపోవాలి అనిపించేలా కనెక్ట్ అవుతుంది. సోనాలి బింద్రేని తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యేలా చేసిన సినిమా మురారి. ఈ సినిమాతో మహేష్ స్టార్ డం తెచ్చుకున్నాడు. మణిశర్మ మ్యూజిక్ కూడా సినిమాకు మరో హైలెట్ అని చెప్పొచ్చు. మురారిలో పెళ్లి పాత అలనాటి రామాచంద్రుడు సాంగ్ ఇప్పటికి కూడా ఓ ఊపు ఊపేస్తోంది. ప్రతి ఇంట్లో పెళ్లి సిడిలో ఆ సాంగ్ కచ్చితంగా ఉండాల్సిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: