విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటించిన సినిమా గీతా గోవిందం. పరశురామ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాను గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో బన్నీ వాసు నిర్మించారు. సినిమాలో హీరోయిన్ కోసం ఎంతోమందితో చర్చలు జరుపగా ఫైనల్ గా రష్మిక ఓకే చెప్పింది. ఛలో సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు గీతా గోవిందం సినిమాతో స్టార్ క్రేజ్ తెచ్చుకుంది. ఆ సినిమాలో విజయ్, రష్మికల జోడీ స్పెషల్ ఎట్రాక్షన్ అని చెప్పొచ్చు. 


మంచి క్యారక్టర్ ఉన్న విజయ్ గోవింద్ తాగిన స్నేహితుడు చెప్పిన మాట విని బస్సులో హీరోయిన్ తో అసభ్య కరంగా ప్రవర్తిస్తాడు. అది నచ్చని హీరోయిన్ పెద్ద గొడవ చేస్తుంది. సినిమా పాయింట్ చిన్నదే కానీ దాన్ని దర్శకుడు నడిపించిన విధానం చాలా బాగుటుంది. యూత్ ఆడియెన్స్ కు బాగా నచ్చిన ఈ సినిమా 100 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. సినిమాలో మేడం మేడం అంటూ తన సిన్సియారిటీ తెలిపేందుకు విజయ్ బాగా ప్రయత్నిస్తాడు. విజయ్, రష్మిక రొమాన్స్ హైలెట్ గా నిలిచినా ఈ సినిమాతో వాళ్ళిద్దరిది హాట్ పెయిర్ గా నిలిచింది. 


సినిమా సక్సెస్ తో విజయ్ తో రష్మిక డియర్ కామ్రేడ్ సినిమా చేసింది. అయితే ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఫలితాన్ని అందుకోలేదు. రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లో కూడా విజయ్, రష్మికల మధ్య సంథింగ్ సంథింగ్ అనేలా వీరి ఆన్ స్క్రీన్ రొమాన్స్ పండింది. గీతా గోవిందం లాంటి మరో క్రేజీ మూవీ ఈ ఇద్దరితో చేస్తే మళ్ళీ అది కూడా 100 కోట్లు వసూలు చేయడం గ్యారెంటీ అని చెప్పొచ్చు. విజయ్, రష్మిక సినిమా అంటే రొమాన్స్ పీక్స్ లో ఉంటుందని మాత్రం అంచనా వేయొచ్చు. మాములుగా దేవరకొండ సినిమా అంటేనే లిప్ లాక్స్ చాలా కామన్ అయ్యాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: