'ఖైదీ నెం. 150' తో సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలను లైన్లో పెడుతూ ఫ్యాన్స్ ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాడు. గతేడాది 'సైరా నరసింహా రెడ్డి'తో పలరించిన చిరు ప్రస్తుతం 'ఆచార్య' సినిమాలో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహిస్తుండగా కొణిదెల ప్రొడక్షన్స్ మరియు మాట్నీ మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే చాలా భాగం షూటింగ్ జరుపుకున్న 'ఆచార్య' లాక్ డౌన్ కారణంగా షూటింగ్ నిలుపుదల చేసుకుంది. 'ఆచార్య' సినిమా తర్వాత మెగాస్టార్ మరో మూడు సినిమాలు చేయబోతున్నారు. ఇప్పటికే ఆ సినిమాలకు సంబందించిన కథలు విన్న చిరు ఇటీవల బాబీ, సుజిత్, మెహర్ రమేష్ లతో సినిమాలు చేయబోతున్నట్లు ప్రకటించాడు. ఈ నేపథ్యంలో ముందుగా మలయాళంలో సూపర్ హిట్ అయిన 'లూసిఫర్' సినిమాను తెలుగులో రీమేక్ చేయనున్నారు మెగాస్టార్. పొలిటికల్ అండ్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కనున్న ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌ పై రామ్ చరణ్ నిర్మించనున్నాడు. ఈ రీమేక్ కు 'సాహో' ఫేమ్ సుజిత్ దర్శకత్వం వహించబోతున్నాడు. ఇప్పటికే మన నేటివిటీకి తగ్గట్లు తగినన్ని మార్పులు చేస్తున్నాడట సుజీత్.

 

ఇదిలా ఉండగా అయితే ఈ సినిమాలో మంజు వారియర్ పాత్ర కూడా కీలకమైనదే. కాగా తెలుగు వర్షన్ లో ఆ పాత్రలో విజయశాంతి నటించబోతున్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ వార్తలో ఎంత నిజం ఉందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే. కాగా తెలుగు ఆడియన్స్ కోరుకునే ఎమోషన్స్ కి తగ్గట్టుగా లూసిఫెర్ స్క్రిప్ట్‌ లో మెగాస్టార్ కొన్ని కీలకమైన మార్పులను సూచించాడని సమాచారం. 'లూసిఫర్' ఓ పొలిటికల్ అండ్ యాక్షన్ థ్రిల్లర్. ఆ చిత్రంలో హీరో మిడిల్ ఏజ్ మ్యాన్ క్యారక్టర్ లో కనిపిస్తాడు. ఒరిజనల్ కథలో మోహన్‌ లాల్‌ కు హీరోయిన్ ఉండదు.. పాటలు కూడా ఉండవు. మరి అదే రోల్ ఇక్కడ చిరంజీవి చేస్తుండగా ఆయన పక్కన హీరోయిన్ లేకుండా మూవీ వర్క్ అవుట్ అవుతుందా అనే ఆలోచన అందర్లోనూ ఉంది. చిరంజీవి పక్కన హీరోయిన్ లేకపోతే ఫ్యాన్స్ ఊరుకోరు. స్టోరీ ఎలా ఉన్నా చిరంజీవి హీరో కాబట్టి హీరోయిన్ పెట్టాల్సిన అవసరం ఉంది. అయితే సుజీత్ ఆ మార్పులను పూర్తి చేసి చిరుకి స్క్రిప్ట్‌ వినిపించాడని.. ఫైనల్ గా చిరు కూడా స్క్రిప్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తోంది. ముఖ్యంగా హీరోయిజమ్ ఎలివేషన్స్ ఉన్న సన్నివేశాలు సినిమాలోనే మెయిన్ హైలైట్ గా నిలుస్తాయని.. మెగా అభిమానులకు ఫుల్ జోష్ ని ఇచ్చేలా ఉంటాయట.

మరింత సమాచారం తెలుసుకోండి: