నందమూరి సింహం బాలకృష్ణకు కోపం వచ్చినా ప్రేమ కలిగినా  పట్టుకోవడం కష్టం. దీనితో గతంలో  తనకు ఎన్నో హిట్లు ఇచ్చిన సీనియర్ దర్శకుడు బి. గోపాల్ కోరిక తీర్చడానికి బాలయ్య ఒక మాట ఇచ్చాడు అన్న ప్రచారం జరుగుతోంది. బాలకృష్ణ బి. గోపాల్ కాంబినేషన్ లో ‘లారీ డ్రైవర్’ ‘రౌడీ ఇన్స్పెక్టర్’ ‘సమరసింహా రెడ్డి’ ‘నరసింహనాయడు’ లాంటి సూపర్ హిట్ సినిమాలు వచ్చిన విషయం తెలిసిందే.

 

ఆతరువాత వీళ్లిద్దరి కాంబినేషన్ లో 'పల్నాటి బ్రహ్మనాయుడు' మూవీ వచ్చినా అది చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఘోర పరాజయం చెందింది.  అలాంటి  బి. గోపాల్ ఇప్పటివరకు 99 సినిమాలకు దర్శకత్వం వహించినా తన 100వ సినిమా చేయలేదు అన్నఅసంతృప్తి బి. గోపాల్ ను వెంటాడుతోంది. ఇలాంటి పరిస్థితులలో తన 100వ సినిమాను బాలకృష్ణతో చేయాలి అని ఆశ పడుతున్న గోపాల్ ఆశలకు బాలయ్య అంగీకారం లభించినట్లు వార్తలు వస్తున్నాయి.

 

ప్రస్తుతం ఈ లాక్ డౌన్ సమయంలో ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ చాల వేగంగా కొనసాగుతోంది అన్న వార్తలు వస్తున్నాయి. ప్రముఖ రచయిత బుర్రా సాయిమాధవ్ స్క్రిప్ట్ కు మరిన్ని మెరుగులు దిద్దుతున్నారని టాక్. ఈ సినిమా కథ రీత్యా బాలకృష్ణ ఒక యువతికి తండ్రిగా ఒక కొత్త తరహా పాత్రలో కనిపిస్తాడని తెలుస్తోంది.

 

మూవీ కథ అంతా ఆ యువతి చుట్టూ తిరుగుతుందని తెలుస్తోంది. ఒక విధంగా చెప్పాలి అంటే పేరుకు బాలయ్య సినిమా అయినా ఒక హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలా ఈ కథ ఉంటుంది అని అంటున్నారు. ఈ ప్రాజెక్ట్ కు మరింత క్రేజ్ తీసుకు రావడానికి దర్శకుడు బి. గోపాల్ క్రేజీ హీరోయిన్ కీర్తి సురేశ్ కు ఈకథ చెప్పాడని ఆమెకు కూడ ఈకథ బాగా నచ్చింది అన్న వార్తలు వినిపిస్తున్నాయి. లాక్ డౌన్ ముగిసి తిరిగి షూటింగ్ లు మొదలయ్యాక ఈ మూవీ ప్రాజెక్ట్ విషయమై అధికారిక ప్రకటన వస్తుంది అని అంటున్నారు..  

మరింత సమాచారం తెలుసుకోండి: