ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఇండియన్ సినిమా అభిమానులు మొత్తం 'ఆర్‌ ఆర్‌ ఆర్‌' సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా.. ఎవరి నోట విన్నా 'ఆర్.ఆర్.ఆర్' మాటే వినిపిస్తోంది. స్టార్ హీరోలు ఎన్టీఆర్ రామ్‌ చరణ్‌ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో డీవీవీ దానయ్య నిర్మిస్తున్న భారీ మల్టీస్టారర్ చిత్రం ‘రౌద్రం రణం రుధిరం’ (ఆర్‌ ఆర్‌ ఆర్‌). ఇందులో స్వాతంత్య్ర సమరయోధులు 'కొమురం భీం' పాత్రలో ఎన్టీఆర్ కనిపిస్తుండగా 'అల్లూరి సీతారామ రాజు' పాత్రలో రామ్‌ చరణ్‌ నటిస్తున్నారు. ఇదిలా ఉండగా ఇది 'కొమురం భీం' -  'అల్లూరి సీతారామ రాజు' పాత్రలను తీసుకొని రూపొందిస్తున్న కల్పిత కథ అని జక్కన్న మొదటి నుండి చెప్తూనే వస్తున్నాడు. నిజానికి అల్లూరి - భీమ్ నిజ జీవితంలో ఒకరినొకరు ఎప్పుడూ కలుసుకోలేదు. కలుసుకున్నట్లు మనకు ఆధారాలు కూడా లేవు. మరి వీరిద్దర్నీ సినిమాలో స్నేహితులుగా రాజమౌళి ఎలా కలిపారో అనే సీక్వెన్స్ పై అందరూ చాలా ఆసక్తిగా ఆలోచిస్తున్నారు. సినిమా వచ్చాక ఆ సీక్వెన్స్ నే హైలైట్ అయ్యే అవకాశం ఉంది.

 

రామ్ చరణ్ 'రౌద్రం' చూపిస్తుండగా ఎన్టీఆర్ 'రుధిరం' చూపిస్తాడని.. వీరిద్దరూ కలిసి చేసే రణమే ‘రౌద్రం రణం రుధిరం’ అని మనకు టైటిల్ ద్వారా రివీల్ చేసాడు రాజమౌళి. ఇప్పటికే రామ్ చరణ్ 'సీతారామరాజు'గా ఎలా ఉండబోతుందో శాంపిల్ చూపించేసాడు. ఇక ఎన్టీఆర్ 'కొమరం భీమ్' లుక్ మాత్రం ఇంకా రివీల్ చేయలేదు. మొన్న తారక్ బర్త్ డే కి వస్తుందేమో అని అందరూ ఆశించారు. కానీ నిరాశే ఎదురైంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్ర ఎలా ఉండబోతుందని అని తారక్ ఫ్యాన్స్ ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమా స్టార్ట్ అయినప్పటి నుండి ఎన్టీఆర్ చరణ్ అభిమానులతో పాటు యావత్ సినీ అభిమాని మదిలో మెలిగిన ప్రశ్న.. రాజమౌళి ఈ సినిమాలో ఎవరికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారో, ఇద్దరిని బ్యాలన్స్ గా చూపించాడా అని. ఎందుకంటే ఇద్దరు స్టార్ హీరోలు ఒక సినిమాలో కలిసి నటిస్తున్నారు అంటే వారి ఫ్యాన్స్ ఖచ్చితంగా వాళ్ళ హీరో డామినేషన్ ఉండాలని కోరుకోవడం సహజం.

 

'ఆర్.ఆర్.ఆర్'లో ఎన్టీఆర్ - రామ్ చరణ్ క్యారెక్టర్ల రన్ టైమ్ గురించి ఎలాంటి సందేహాలు పెట్టుకోవద్దని ఇద్దరి పాత్రలకు ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంటుందని వీరి పాత్రలను చెక్కిన జక్కన్న చెప్పుకొచ్చాడు. కాగా అత్యంత భారీగా తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్స్ అజయ్ దేవగణ్, ఆలియా భట్, బ్రిటిష్ నటి ఒలివియా మోరిస్‌ నటిస్తున్నారు. ఈ చిత్రానికి జక్కన్న ఆస్థాన సంగీత దర్శకుడు కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాను దాదాపు పది భాషల్లో వచ్చే ఏడాది జనవరి 8న విడుదల చేయాలనుకుంటున్నారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అది సాధ్యపడేలా కనిపించడం లేదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: