మిహీకా బజాజ్ తో తన పెళ్ళి నిశ్చయం అయిన తరువాత మంచి జోష్ మీద ఉన్న రానా ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తనకు కాబోయే భార్య మిహికా గురించి అదేవిధంగా తాను ఆమెను పెళ్ళి చేసుకోవడానికి తీసుకున్న నిర్ణయం గురించి అనేక ఆసక్తికర విషయాలు షేర్ చేసాడు. ‘మనలను మనం పరిపూర్ణంగా అర్థం చేసుకున్నప్పుడు మనకు ఏమి కావాలో మన మనసు ఎవరిని కోరుకుంటుందో ఇట్టే తెలిసి పోతుంది. అలాంటి భావన తనకు మిహికా పట్ల ఏర్పడింది’ అంటూ తనకు మిహికా పట్ల ఉన్న అవ్యాజ్యమైన ప్రేమను బయటపెట్టాడు.


అంతేకాదు తనకు మిహికా తో పరిచయం ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నా తాను ఆమెను పెళ్ళి చేసుకోవాలి అన్న నిర్ణయం కేవలం ఒకే ఒక్కరోజు తీసుకున్నాను అని చెపుతూ తాను ఫోన్ చేసి తనను పెళ్లి చేసుకుంటావా అని అడిగినప్పుడు మిహికా ఒకే ఒక్క మాటలో తేల్చిసింది అంటూ జోక్ చేసాడు. అయితే తమ ప్రేమ వ్యవహారం తెలిసి తన తల్లి ఒక్క క్షణం షాక్ అయి తాను పెళ్ళి చేసుకుంటున్నందుకు ఆనందించి ఓకె చేసిన విషయాన్ని బయటపెట్టాడు.


ఇక తన పెళ్ళి గురించి మాట్లాడుతూ తన పెళ్ళి ఎలా జరుగుతుంది అన్న విషయం పరిస్థితుల పై ఆధారపడి ఉంటుందని కరోనా సమస్యలు వాళ్ళ పెళ్ళి చేసుకోవడానికి కూడ వింత పరిస్థితులు ఏర్పడటంతో జరుగుతున్న పరిణామాలు తనకే ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి అంటూ కామెంట్స్ చేసాడు. ప్రస్తుతం కొనసాగుతున్న లాక్ డౌన్ పిరియడ్ లో ఒటీటీ లో వస్తున్న సినిమాలు చూస్తున్నానని తనకు ఇష్టమైన కామిక్ పుస్తకాలను చదువుతూ తాను తన లాక్ డౌన్ పిరియడ్ ఎంజాయ్ చేస్తున్న విషయాన్ని బయటపెట్టాడు.


తనకు కాబోయే భార్యకు రింగ్ దొరకలేదు అని బయటపెట్టాడు. ఇక తాను ‘వై ఆర్ యు’ అనే టాక్ షోను ప్లాన్ చేస్తున్న విషయాన్ని తెలియచేస్తూ త్వరలో ఒక ప్రముఖ ఒటీటీ ప్లాట్ ఫామ్ పై ఈ టాక్ షో రాబోతున్న విషయాన్ని లీక్ చేసాడు. ఈ టాక్ షో చూసేవారిని ఆలోచింప చేసే విధంగా ఉంటుంది అని చెపుతూ పూర్తిగా తెలుగు అక్షరాలు తెలియని తాను తెలుగు మాట్లాడటం వచ్చినా తెలుగు అక్షరాలు ఏమిటో తెలియని మిహికా ను పెళ్ళాడటం యాధృశ్చికం అంటున్నాడు..  

మరింత సమాచారం తెలుసుకోండి: