యువ హీరో రాజ్ తరుణ్ 'ఉయ్యాలా జంపాల' చిత్రంతో టాలీవుడ్ కు పరిచయమయ్యాడు. మొదటి సినిమాకే సురేష్ బాబు - నాగార్జున లాంటి వారి సపోర్ట్ ఉండటంతో మంచి విజయాన్ని అందుకొని క్రేజీ హీరోగా మారిపోయాడు. కొన్ని రోజులపాటు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాకుండా వరుస అవకాశాలు తలుపుతట్టాయి. కెరీర్ ఆరంభంలో తన హుషారైన నటనతో అందరి ప్రశంసలు దక్కించుకున్నాడు. రాజ్ తరుణ్ ని చూసి అందరూ ఇండస్ట్రీలో 'మరో రవితేజ' అని ప్రశంసలు కూడా కురిపించారు. ఆ తర్వాత 'సినిమా చూపిస్త మామ' 'కుమారి 21 ఎఫ్' లాంటి సూపర్ హిట్స్ సొంతం చేసుకున్నాడు. కానీ ఇటీవల రాజ్ తరుణ్ కు వరుస పరాజయాలు ఎదురవుతున్నాయి. ఎన్ని సినిమాలు సెట్ చేసినా హిట్ మాత్రం అందని ద్రాక్షలా మారింది. ఎలాంటి సపోర్ట్ లేకుండా చాల స్పీడ్ గా ఎదిగిన రాజ్ తరుణ్.. ప్రస్తుతం రేసులో వెనుక పడిపోయాడు.

 

ప్రస్తుతం రాజ్ తరుణ్ కు కెరీర్ పరంగా డూ ఆర్ డై సిచ్యుయేషన్ క్రియేట్ అయ్యిందని చెప్పవచ్చు. దీంతో నెక్స్ట్ సినిమాతో అయినా సక్సెస్ అందుకోవాలని ఎంతో కష్టపడి 'గుండజారి గల్లంతయ్యిందే' ఫేమ్ విజయ్ కుమార్ కొండా దర్శకత్వంలో 'ఒరేయ్ బుజ్జిగా' సినిమాలో నటించాడు రాజ్ తరుణ్. మాళవికా అయ్యర్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాని శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌ పతాకంపై కె.కె. రాధామోహన్‌ నిర్మించారు. ఈ సినిమా మార్చి 25న ఈ సినిమా విడుదలకావాల్సింది. కానీ కరోనా లాక్‌ డౌన్ కారణంగా సినిమా విడుదల ఆగిపోయింది. ‘ఒరేయ్… బుజ్జిగా’ సినిమా పై రాజ్ తరుణ్ చాలా ఆశలే పెట్టుకున్నాడు. ఈ సినిమా హిట్ అయితేనే రాజ్ తరుణ్ కెరీర్ సజావుగా సాగుతుంది. కాగా హిట్ డైరెక్టర్ గా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన కొండా విజయ్ కుమార్ కెరీర్ కి కూడా ఈ సినిమా చాలా కీలకం కానుంది. ఈ చిత్రంలో హెబ్బా పటేల్‌, వాణీ విశ్వనాథ్‌, నరేష్‌, పోసాని కృష్ణమురళి ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. రాజ్ తరుణ్ కనీసం ఈ సినిమాతోనైనా హిట్ అందుకుంటాడేమో చూడాలి. గత కొన్ని రోజులుగా ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ కాబోతోంది అంటూ వార్తలు వస్తున్నాయి. కానీ ఈ సినిమా దర్శక నిర్మాతలు ఈ వార్తలను ఖండించారు. ‘ఒరేయ్… బుజ్జిగా’ థియేటర్స్ లోనే రాబోతోంది అని క్లారిటీ ఇచ్చారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: