తెలుగు సినిమా కు ఓ టెంప్లెట్‌ ఫార్ములా ఉంది. విలన్‌ అంటే కేవలం హీరో తో గొడవపడాలి. హీరో ను ఇబ్బందుల పాలు చేయాలి. కానీ అలాంటి రొటీన్‌ ఫార్ములా ను బ్రేక్‌ చేసిన దర్శక నిర్మాతలు హీరోలు కూడా మన ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు. విలన్‌ తో కూడా డ్యూయట్‌ పాడించి మెప్పించారు. అలాంటి సాహసమే చేశాడు సీనియర్‌ ఎన్టీఆర్‌. అది కూడా ఓ మామూలు కమర్సియల్ సినిమాలో కాదు. ప్రతీ భారతీయుడికి సుపరిచితమైన పౌరాణిక గాధ మహాభారత కథ లో విలన్‌ పాత్రధారికి అద్భుతమైన రొమాంటిక్ డ్యూయెట్‌ నె పెట్టాడు ఎన్టీఆర్.

 

ఎన్టీఆర్ స్వీయ దర్శకత్వంలో నటించి నిర్మించిన సినిమా దాన వీర శూర కర్ణ. ఈ సినిమాలో ఎన్టీఆర్‌ కృష్ణుడిగా, కర్ణుడిగా, దుర్యోధనుడిగా త్రిపాత్రాభినయం చేశాడు. అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్‌ దుర్యోధనుడి పాత్రకు కూడా డ్యూయెట్ పెట్టే సాహసం చేశాడు. ఈ డ్యూయెట్‌ ను ఎన్టీఆర్‌, ప్రభల మీద తెరకెక్కించారు. ఈ పాటకు పెండ్యాళ నాగేశ్వరరావు సంగీతం అందించగా సీ నారయణ రెడ్డి సాహిత్యం అందించాడు. ఎస్‌ పీ బాలసుబ్రమణ్యం, పీ సుశీలలు మహాద్బుతం గా ఆలపించారు.

 

సినిమా టైటిల్ ‌లో కర్ణుడిని ప్రధానంగా చూపించినా సినిమా అంతా దుర్యోధనుడి పాత్ర చుట్టూనే తిరుగుతుంది. ముఖ్యంగా ఓ విలన్ పాత్రకు ఇంట్రడక్షన్‌ సాంగ్‌ తో పాటు డ్యూయెట్ ‌ను పెట్టడం అనేది ఓ భారీ సాహసం. ఆ సాహసాన్ని చేసి సక్సెస్‌ అయ్యాడు ఎన్టీఆర్‌. అందుకే ఆ పాట అప్పటికీ ఇప్పటికీ ఎంతో మందికి ఇన్సిపిరేషన్ ‌గా నిలిచింది. తెలుగు తెర మీద విలన్‌ పాత్రలో కూడా రొమాంటిక్‌ యాంగిల్ చూపించిన తొలి చిత్రంగా దాన వీర శూర కర్ణను చెప్పుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: