2004వ సంవత్సరంలో తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి విడుదల అయిన ప్రేమకథాచిత్రం 7G బృందావన్ కాలనీ ఓ అర్జున్ రెడ్డి, ఓ కుమారి 21ఎఫ్ స్థాయిలో తెలుగు పరిశ్రమలో ప్రకంపనలు సృష్టించి సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. కొన్ని నెలల తరువాత ఈ సినిమా జెమినీ టీవీలో ప్రసారం అయ్యింది. నిజం చెప్పాలంటే అప్పట్లో ఈ సినిమా టీవీ లో చూడాలంటే ఎంతో ఇబ్బంది పడాల్సివచ్చేది. ఎందుకంటే ఈ చిత్రంలో అన్ని డబల్ మీనింగ్ డైలాగులు ఉండటం తో పాటు ఫ్యామిలీతో కలిసి కూర్చొని చూడలేని శృంగారభరిత సన్నివేశాలు ఉంటాయి. రవి సోనియా అగర్వాల్ ని కంటితోనే రేప్ చేసేట్టు చూడడం... రవి, అనిత మధ్య కొనసాగే లిప్ లాక్ సన్నివేశం... అనిత రవికి సెక్సువల్ ఇంటర్ కోర్సు ఆఫర్ ఇవ్వడం... జనవరి మాసం పాట ఇంకా పలు శృంగార భరితమైన సన్నివేశాలు కుర్రకారు కిక్కెక్కించాయి. నిజానికి టీవీ ఛానల్ చాలా సన్నివేశాలను సెన్సార్ చేసినప్పటికీ ఆ సినిమాలో కీలకమైన సన్నివేశాలు మాత్రం కట్ చేయలేకపోవడంతో వీక్షకులు సినిమా చూడాలంటేనే జంకేవారు. 


ఈ చిత్రంలో రవి కృష్ణ, సోనియా అగర్వాల్ హీరోహీరోయిన్ల క్యారెక్టర్లలలో నటించగా... సుమన్ షెట్టి ప్రధాన పాత్రలో నటించి అందరిని తెగ మెప్పించాడు. రవి తండ్రిగా చంద్రమోహన్ ఎంత సహజంగా నటించారు అంటే... అతడి నటనకు ఆస్కార్ అవార్డు ఇచ్చిన తక్కువే అనిపిస్తుంది. ఈ చిత్రానికి దర్శకత్వం వహించింది తమిళ దర్శకుడు సెల్వరాఘవన్. ఇతడు యుగానికొక్కడు, యువ లాంటి విభిన్నమైన చిత్రాలను తెరకెక్కించి దక్షిణాది ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉత్తమ దర్శకుడిగా పేరు ప్రఖ్యాతలు సంపాదించాడు. సెల్వరాఘవన్ మొట్టమొదటిగా తెరకెక్కించిన సినిమా తుళ్ళువదే ఇల్లమై లో ధనుష్ ని ప్రతినాయకుడిగా చూపించాడు. 


ఆ తర్వాత 2004లో వచ్చిన 7 జి బృందావన్ కాలనీ లో కూడా హీరో రవి ని నెగిటివ్ షేడ్ లో చూపించాడు. రవి ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టి కాలేజీ కి వెళ్ళకుండా, చదువుకోకుండా... ప్రతి ఎగ్జామ్స్ లో ఫెయిల్ అవుతూ తన తండ్రికి భారంగా మారుతాడు. ఇది చాలదన్నట్టు గొడవల్లో తల దూరుస్తుంటాడు. దాంతో తన తండ్రి రిటర్న్ పనికిమాలిన వెధవ అంటూ బాగా తిడుతుంటాడు. తన తండ్రి తిట్లకు సహించలేని రవి ఇంటి నుండి వెళ్ళిపోదాం అనుకుంటున్న సమయంలో బిజినెస్ లో లాస్ వచ్చి సెవెన్ జి బృందావన కాలనీ లో ఓ చిన్న ఇంటికి మార్వాడి కుటుంబం మొత్తం మకాం మారుస్తారు. ఆ కుటుంబంలో కాలేజీ చదువుకుని అనిత అనే ఓ అమ్మాయి ఉండగా... ఆమెపై తాను మనసు పారేసుకుంటాడు. ఇక అప్పటినుండి సినిమా ప్రారంభమవుతుంది. ఏదేమైనా ఈ సినిమా పూర్తి అడల్ట్ కంటెంట్ తో ఏడిపించే క్లైమాక్స్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చి అశేషమైన పాపులారిటీని సంపాదించుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: