టాలీవుడ్ లో బాలకృష్ణ సినిమాలు అనగానే జనాలకు ముందు నుంచి కూడా ఒక క్రేజ్ అనేది ఉంది. అతి తక్కువ కాలంలో ఆయన సంపాదించిన క్రేజ్ గురించి ఎంత చెప్పినా సరే తక్కువే అవుతుంది. తండ్రి ఇమేజ్ ఉన్నా సరే తాను మాత్రం తనకంటూ ఒక సొంత ఇమేజ్ ని బాలకృష్ణ క్రియేట్ చేసుకుని దాని ఆధారంగానే ఆయన సినిమాలు చేస్తూ వస్తున్నారు. తన సినిమాలు అనగానే ఇలాగే ఉంటాయి అనే విధంగా ఆయన సినిమాలు చేస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే ఆయన సినిమాల్లో ఉండే కొన్ని సన్నివేశాలు సోషల్ మీడియాలో ఇప్పటికి కూడా వైరల్ అవుతూనే ఉంటాయి. 

 

ఆయన ప్రేమ కథా చిత్రాలు చేసింది చాలా తక్కువ. అయినా సరే ఆయన సినిమాల్లో ఉండే కొన్ని రోమాన్స్ సన్నివేశాలు మాత్రం ప్రేక్షకులకు బాగా నచ్చాయి అనేది వాస్తవం. ఆయన సినిమాల్లో వాటికి అంటూ ఒక ప్రత్యేక గుర్తింపు కూడా ఉందని ఆయన అభిమానులు కామెంట్స్ చేస్తూ ఉంటారు. ఇక ఆయన హీరో గా వచ్చిన చెన్న కేశవ రెడ్డి సినిమా ఏ స్థాయిలో సంచలనం సృష్టించింది అనేది అందరికి తెలిసిందే. ఆ సినిమాలో బాలకృష్ణ నటన చూసి విమర్శకులు కూడా షాక్ అయ్యారు. ఆయన మినహా ఆ సినిమాను ఎవరూ చేయలేరు అంటూ కొనియాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. 

 

ఇక ఆ సినిమాలో ఆయన టబు తో చేసిన కొన్ని సీన్లు అయితే సోషల్ మీడియాలో ఇప్పుడు కూడా కనపడుతున్నాయి. పెళ్లి సందర్భంగా బాలకృష్ణ రెడీ అవుతుంటే ఆడాళ్ళు కూడా రెడీ అవ్వరు బావా అంటూ టబు అన్న సందర్భంలో బాలకృష్ణ ఆమెతో కాస్త రోమాన్స్ చేస్తారు. అది తక్కువే అయినా ఆ సీన్ మాత్రం విస్తృతంగా వైరల్ అయింది అప్పట్లోనే. సోషల్ మీడియాలో ఇప్పటికి కూడా కనపడుతూనే ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: