ఖైదీ... టాలీవుడ్ లో ఈ సినిమా సృష్టించిన సంచలనం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. చిరంజీవి కెరీర్ లో ఈ సినిమా ఒక సంచలనం అనే చెప్పాలి. ఆయన సినిమాలను బాలీవుడ్ ప్రేక్షకులు కూడా అక్కడి నుంచి చూడటం మొదలు పెట్టారు అంటే ఆ సినిమా ఏ స్థాయిలో విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ సినిమాలో చిరంజీవి నటన మాధవి నటన చూసిన ప్రేక్షకులు అయితే సినిమా అంటే ఇలా ఉండాలి అనే విధంగా ఉంది ఆ సినిమా. ఆ సినిమా తర్వాత చిరంజీవి రేంజ్ అమాంతం పెరిగిపోయింది. 

 

ఆయన సినిమాలు అనగానే యువతలో ఒక క్రేజ్ వచ్చింది ఆ సినిమాతోనే అనేది వాస్తవం. ఆ సినిమా చూసిన ప్రేక్షకులు అయితే సినిమా అంటే ఇలా ఉండాలి అంటూ అప్పుడు వ్యాఖ్యలు కూడా చేసారు అనే విధంగా ఉంది ఆ సినిమా. ఇక ఆ సినిమాలో చిరంజీవి మాధవి రోమాన్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే. కొన్ని కొన్ని సన్నివేశాల్లో రోమాన్స్ లో జీవించారు   ఆ ఇద్దరు అనేది వాస్తవం. ప్రతీ సీన్ కూడా వాళ్ళు కలిసి నటించింది చాలా వరకు ప్రేక్షకులకు  నచ్చింది. విమర్శకుల ప్రసంశలు కూడా ఆ సినిమా అందుకుంది. 

 

ఒక పాటలో వాళ్ళు ఇద్దరూ కలిసి చేసిన సన్నివేశం అయితే ప్రేక్షకులకు మత్తు ఎక్కించింది అనేది వాస్తవం. ఆ విధంగా ఆ సినిమా ప్రేక్షకులకు గుర్తు ఉండి పోయింది. ఇక మాధవి కూడా అప్పుడు స్టార్ హీరోయిన్ అయినా సరే చిరంజీవి పక్కన నటించారు. అప్పుడు మాధవి కి ఉన్న క్రేజ్ ఎక్కువ. చిరంజీవి చిన్న హీరో... ఆ తర్వాత చిరంజీవి ఒక్క సారిగా స్టార్ హీరో అయిపోయారు. ఆ సినిమా ఇప్పుడు వచ్చినా సరే ప్రేక్షకులు చూస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి: