బాలీవుడ్ ఇండస్ట్రీలో ఆయుష్మాన్ ఖురానా, టబు ముఖ్యపాత్రల్లో నటించిన సినిమా "అంధాధున్‍" . ఈ సినిమాలో బతుకుతెరువు కోసం ఆంధ్రుడిగా నటించి ఒక పియానో ప్లేయర్ గా జీవితంలో ఎదురయ్యే ఘటనలను ఆధారంగా తీసుకొని ఈ సినిమా తీయడం జరిగింది. ఇక బాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ సినిమా విమర్శకుల ప్రశంసలతో పాటు జాతీయ పురస్కారాన్ని కూడా సొంతం చేసుకోవడం జరిగింది. ఇది ఇలా ఉండగా ఈ సినిమాని తెలుగు ఇండస్ట్రీలో నితిన్ హీరోగా రీమేక్ చేయాలని అనుకోవడం జరిగింది. 

IHG

 

అలాగే ఈ చిత్రానికి మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్నారు. అంతేకాకుండా నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి నిఖితారెడ్డి లు కలిసి ఈ సినిమాకి నిర్మాతలుగా వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాలో హీరోయిన్గా ఎవరు అనేది ప్రేక్షకులలో ఆసక్తికరంగా మారింది. అంతేకాకుండా ఇప్పటికే హీరోయిన్ కోసం వేట కూడా మొదలు పెట్టినట్లు చిత్రయూనిట్ తెలియజేసింది. 

 

IHG

 

ఈ సినిమాలో గ్యాంగ్ లీడర్ హీరోయిన్ ఫేమ్ ప్రియాంక మోహన్, కీర్తి సురేష్ ల పేర్లు ప్రచారంలో ఉన్నాయి. ఇక మరో వైపు వెంకీ అట్లూరి దర్శకత్వంలో నితిన్ హీరోగా చేస్తున్న రద్దీ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఈ సినిమాలో కూడా కీర్తి సురేష్ ని హీరోయిన్ గా తీసుకోవాలని నితిన్ భావిస్తున్నట్లు సమాచారం. కానీ మరో వైపు దర్శకుడు మేర్లపాక గాంధీ  మాత్రం ప్రియాంక పై మొగ్గు చూపుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ సినిమాలో నితిన్ తో జతకట్టే ఆ హీరోయిన్ ఎవరో వేచి ఉండాల్సిందే

మరింత సమాచారం తెలుసుకోండి: