బాహుబలి... టాలీవుడ్ లో ఈ సినిమా సృష్టించిన సంచలనం గురించి ఎంత చెప్పినా సరే తక్కువే అవుతుంది. ఈ సినిమాకు ముందు తెలుగు సినిమాసినిమా తర్వాత తెలుగు సినిమా అనే విధంగా ఈ సినిమా ప్రేక్షకులను ఉంచింది అంటే ఏ స్థాయిలో ఇది విజయం సాధించిందో అర్ధం చేసుకోవచ్చు. రెండు భాగాలు కూడా చాలా బాగా ఆకట్టుకున్నాయి ప్రేక్షకులను. మొదటి భాగం విషయానికి వస్తే మొదటి భాగంలో ఉండే కొన్ని సన్నివేశాలు అన్ని వర్గాల ప్రేక్షకులకు కూడా నచ్చాయి అనేది వాస్తవం. ప్రతీ సీన్ కూడా చెక్కినట్టు ఉంది అంటూ కొందరు కామెంట్స్ కూడా చేసారు. 

 

ఇక అది అలా ఉంటే మొదటి భాగంలో ప్రభాస్ కి తమన్నా కు మధ్య జరిగిన కొన్ని కొన్ని సన్నివేశాలు అయితే యువతను బాగా ఆకట్టుకున్నాయి అనేది వాస్తవం. అందులో పచ్చ బొట్టేసినా అనే సాంగ్ కి ముందు వాళ్ళ మధ్య రోమాన్స్ జరుగుతుంది. అది ప్రేక్షకులకు చాలా బాగా నచ్చింది. ఆ సీన్ ని రాఘవేంద్ర రావు పర్యవేక్షణ లో చేసారు. ఆ సీన్ లో ప్రభాస్ తమన్నా ఇద్దరూ కూడా జీవించారు అనే చెప్పుకోవచ్చు. ఇక ఆ సీన్ లో తమన్నా అందాల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి అని అంటారు. ఆమె ఆ విధంగా మెప్పించింది ఆ సీన్ లో. 

 

ఇక మొదటి భాగంలో వారి మధ్య ఉన్న ప్రేమ ఎక్కువగా ఆకట్టుకుంది. రెండో భాగంలో పెద్దగా లేకపోయినా సరే మొదటి భాగంలో మాత్రం మెప్పించారు. ఇక ఇదిలా ఉంటే ప్రభాస్ ఇప్పుడు రాధాకృష్ణ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకి రానుంది. ఈ సినిమా తర్వాత వరుసగా మూడు సినిమాలకు ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: