బాహుబలి 2... తెలుగులో ఈ సినిమా ఒక సంచలనం. ప్రపంచం దృష్టిని ఆకర్షించిన సినిమా ఇది అనేది వాస్తవం. ఈ సినిమాకు ముందు ప్రభాస్సినిమా తర్వాత ప్రభాస్ అనే విధంగా ఈ సినిమా ఉంది అనేది వాస్తవం. ఈ సినిమా కోసం ప్రభాస్ పడిన కష్టం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ప్రతీ సీన్ లో కూడా అతను జీవించాడు. దర్శకుడికి ఆలోచనకు తగిన విధంగా ప్రభాస్ నటించిన విధానం ప్రేక్షకులకు బాగా నచ్చింది అనే చెప్పుకోవచ్చు. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాలో ఉండే యాక్షన్ సన్నివేశాలతో పాటుగా అనుష్క ప్రభాస్ మధ్య ఉండే కొన్ని సన్నివేశాలు ప్రేక్షకులకు బాగా నచ్చాయి. 

 

వాళ్ళు ఇద్దరూ కూడా మొదటి భాగంలో చేసే రోమాన్స్ కూడా చాలా బాగా ప్రేక్షకులకు నచ్చింది అనే చెప్పుకోవచ్చు. అనుష్క అయితే ప్రభాస్ పక్కన సరిగా సరిపోతుంది అని అక్కడి నుంచి చాలా మంది కామెంట్స్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ప్రభాస్ నటన చూసిన ప్రేక్షకులు అయితే అతనికి ఆస్కార్ ఇచ్చినా తక్కువే అంటూ వ్యాఖ్యలు చేసారు. ఇక రాజమౌళి కూడా వీరి మధ్య ఉండే రోమాన్స్ సన్నివేశాలను చాలా బాగా ప్రేక్షకులకు చూపించారు అనే విషయాన్నీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతీ సీన్ ని కూడా ఆయన ప్రాణం పెట్టి తీసారు అని అంటారు. 

 

రోమాన్స్ సన్నివేశాలు తీసే క్రమం లో ఆయన కొందరు నిపుణుల సలహాలను కూడా తీసుకున్నారు. ముఖ్యంగా రాఘవేంద్ర రావు సహాకారం తో ఆయన ఆ సన్నివేశాలను ప్రేక్షకులకు అందించారు. ఆ సీన్స్ లో వాళ్ళు ఇద్దరూ భార్యా భర్తల మాదిరిగానే ఉన్నారు అని చాలా మంది కామెంట్ చేసారు. కాగా ఇద్దరూ కలిసి దాదాపు మూడు నాలుగు సినిమాలు చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: