పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తొలినాళ్లలో ఇచ్చిన సూపర్ హిట్స్ లో లవ్ స్టోరీలే ఎక్కువ. అయితే వీటిలో అంతర్లీనంగా ఉన్న రోమాన్స్ ఆడియన్స్ ను ఆకట్టుకనేది. బద్రి, ఖుషి సినిమాల సంగతి చెప్పాల్సిన పని లేదు. ఈ సినిమాల్లో రొమాంటిక్ సీన్లలో పవన్ హావభావాలు యూత్ ని విపరీతంగా అట్రాక్ట్ చేసాయనే చెప్పాలి. పవన్ యూత్ ఆరాధ్య కథానాయకుడిగా మారిపోవడానికి కారణం ఈ లవ్ సినిమాల్లో చేసిన నటనే అని చెప్పాలి. బద్రిలో రేణుదేశాయ్ తో చేసిన రొమాన్స్ సినిమా చూసిన యువతకు తెగ నచ్చేసింది.

IHG

 

పవన్ ఇంటికి రేణు వచ్చినప్పుడు వారిద్దరి మధ్య లవ్ ట్రాక్ ఆకట్టుకుంటుంది. వారిద్దరి రొమాన్స్ సినిమాకు ప్లస్ అయింది. బంగాళాఖాతంలో.. అనే పాటలో కూడా రొమాన్స్ మిక్స్ చేశాడు దర్శకుడు పూరి. వీరిద్దరి ఆన్ స్క్రీన్ కెమెస్ట్రీ అప్పట్లో క్లిక్ అయింది. ఖుషి సినిమాలో పవన్భూమిక మధ్య ఉన్న రొమాంటిక్ సీన్ ఇప్పటికీ హాట్ ఫేవరేట్ అంటే అతిశయోక్తి కాదు. ఇంటర్వల్ కు ముందు వచ్చే సీన్లో భూమిక నడుము చూస్తూ పవన్ చేసిన రొమాంటిక్ సీన్ ఆ సినిమాకే హైలైట్ అయింది. ఆ సీన్ ను అద్భుతంగా తెరకెక్కించాడు డైరక్టర్ సూర్య.

IHG

 

నిజానికి ఆ సీన్ అంత బాగా వచ్చినా కూడా.. అక్కడ పవన్ లేకపోవడం విశేషం. పవన్ ఉన్నాడన్నట్టుగా భూమిక ఎక్స్ ప్రెషన్స్, భూమికను నిజంగా చూస్తున్నట్టు పవన్ ఇచ్చిన ఎక్స్ ప్రెషన్స్ ప్రేక్షకుల్ని గిలిగింతలు పెట్టాయి. ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంలో ఈ సీన్ హెల్స్ కూడా ఉంది. ఇప్పటికీ ఈ సీన్ కు సంబంధించి స్పూఫ్స్ వస్తున్నాయంటే ఆ సన్నివేశం ఏస్థాయిలో క్లిక్ అయిందో అర్ధం చేసుకోవచ్చు. పవన్ చేసిన రొమాంటిక్ సినిమాలుగా వీటిని ఖచ్చితంగా చెప్పుకోవాల్సిందే

 

మరింత సమాచారం తెలుసుకోండి: