సిసిమా ఇండ‌స్ట్రీలో ప్రేమ‌లు, బ్రేక‌ప్‌లు.. పెళ్లిళ్లు, విడాకులు చాలా కామ‌న్ అయిపోయాయి. ఎప్పుడు ఎవ‌రు.. ఎవ‌రితో ప్ర‌మేలో ప‌డ‌తారో,  ఎవ‌రు.. ఎవ‌రిని పెళ్లి చేసుకుంటారో అస్స‌లు అర్థం కాదు. అయితే సినిమా ఇండ‌స్ట్రీలో చాలా ప్రేమ జంటలు వివాహం చేసుకుని సంతోషంగా జీవిస్తున్నారు. మ‌రికొంద‌రు పెళ్లి చేసుకోక ముందే బ్రేక‌ప్‌లు చెప్పుకున్నారు. అలాంటి వారిలో బాలీవుడ్ భామ మాధురి దీక్షిత్ మాధురి దీక్షిత్ కూడా ఒక‌రు. మాధురి దీక్షిత్ 1984లో విడుదలైన ‘అబోద్’ మూవీతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ త‌ర్వాత ఎన్నో సినిమాల్లో న‌టించి త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక‌మైన గుర్తింపు తెచ్చుకుంది.

IHG't want a biopic to be made; just ignore the ...

అయితే మాధురి దీక్షిత్ జీవితంలో పెళ్లి విషయంలో మ్యాజిక్ జరిగిందనే చెప్పాలి. వాస్త‌వానికి సీనియర్ హీరో సంజయ్ దత్ లో ఒకప్పుడు మాధురి దీక్షిత్ పీకల్లోతు ప్రేమలో మునిగిన సంగతి తెలిసిందే. ఇక 1990ల్లో సంజయ్, మాధురి జంట సూపర్ హిట్ జోడీగా పేరుతెచ్చుకుంది. వీరి కాంబినేషన్ లో వచ్చిన  సాజన్, ఖల్ నాయక్ సినిమాలు బాక్సాఫీసు రికార్డులు బద్ధలు కొట్టాయి. ఈ క్ర‌మంలోనే సంజయ్, మాధురి ప్రేమాయ‌ణం అప్ప‌ట్లో హాట్ టాపిక్ అయింది. మాధురి దీక్షిత్‌కు కూడా సంజయ్‌ దత అంటే చాలా ఇష్టం అని అనేక ఇంటర్వ్యూలో వెల్లడించారు.

IHG

అయితే అనుకోకుండా సంజయ్‌తో మాధురి విడిపోయింది. ఆ తర్వాత మాధురి దీక్షిత్ డిప్రెషన్ లోకి వెళ్ళింది. కానీ, అప్పటికే యుఎస్ లో సెటిల్ అయిన తన సోదరుడు అజిత్ దీక్షిత్ వల్ల మాధురి డిప్రెషన్ నుంచి బయటపడింది. యుఎస్ లో మాధురి తన సోదరుడి ఇంట్లో ఉండగా ఆమె పెళ్లి ఫిక్స్ ఐంది. అజిత్ తన స్నేహితుడు, డాక్టర్ గా యుఎస్ లో సెటిల్ అయిన శ్రీరామ్ గురించి మాధురితో చెప్పాడు. అలా  1999లో అమెరికాకు చెందిన శ్రీరామ్ నేనే ఎన్ఆర్‌ఐ ను పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత సినిమాలను కంటిన్యూ చేస్తోన్న మాధురి దీక్షిత్.. లేటు వయసులోనూ తన అందాలను ప్రదర్శిస్తూ తనలో సత్తా తగ్గలేదని నిరూపిస్తోంది. ఇక మాధురీ దీక్షిత్‌లోని నటికి, డ్యాన్సర్‌కి ఇండియా మొత్తం ఫిదా అయింది. ఆమెకు ఈ వ‌య‌స్సులోనూ ఫ్యాన్ ఫాలోంగ్ ఓ రేంజ్‌లో ఉంది.
         

మరింత సమాచారం తెలుసుకోండి: