ఈ మధ్యకాలంలో తెలుగులో బోల్డ్ సినిమాలు ఎక్కువైపోతున్నాయి. అప్పట్లో బోల్డ్ సినిమాలు తెరకెక్కించడానికి ఎంతగానో ఆలోచించేవారు దర్శక నిర్మాతలు. కానీ ఈ మధ్య కాలంలో మాత్రం బోల్డ్ సినిమాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. స్టార్ హీరోలు బోల్డ్ సినిమాల జోలికి వెళ్లక పోయినప్పటికీ చిన్న హీరోలు మాత్రం బోల్డ్ సినిమాల ద్వారా అందరినీ ఆకర్షించి మంచి క్రేజ్ సంపాదించాలని ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అందుకే ఎక్కువగా శృంగార భరితమైన సీన్ లు ఎక్కువగా ఉండేలా  సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఇలా వచ్చిన సినిమాలు కొన్ని విజయం సాధిస్తే మరికొన్ని సినిమాలు ఎక్కడా కనిపించకుండా పోతున్నాయి. 

 

 ఇలా వచ్చిన సినిమాలలో ఒకటి డిగ్రీ కాలేజ్. సినిమా టైటిల్ వినడానికి ఎంతో వినసొంపుగా ఉంది. అది ఒక మంచి పేరు కూడా. సినిమా టైటిల్ వినడానికి బాగా ఉంది కదా అని  సినిమాకి వెళ్తే మాత్రం ఇక  అంతే. ఎందుకంటే లోపల మొత్తం రచ్చరచ్చ ఉంటుంది. అది మామూలు రచ్చ  కాదు... అంతకుమించి అనేంతలా  ఉంటుంది. డిగ్రీ కాలేజ్ సినిమా మొదటి నుంచి ప్రేక్షకులు మరింత ఆసక్తిని పెంచేలా పోస్టర్ విడుదల చేయడం ట్రైలర్ విడుదల చేయడం లాంటివి చేస్తూనే ఉంది. ఇక ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లలో ట్రైలర్ లోనే శృంగారభరితమైన సీన్లు ఫుల్ గా ఉంటాయి. 

 

 ఇక సినిమా విషయానికి వస్తే అయితే మామూలుగా ఉండదు. రచ్చ రచ్చస్య  రచ్చోభ్యహ అనే రేంజ్ లో ఉంటుంది డిగ్రీ కాలేజ్ సినిమా. అయితే ఈ సినిమా పై అప్పట్లో ఎన్నో విమర్శలు కూడా వచ్చాయి. ఈ సినిమా యూత్ ని చెడగొట్టే విధంగా ఉంది అని అప్పట్లో ఎంతో మంది విమర్శలు చేయడమే కాదు ఈ సినిమా పై కేసులు కూడా వేశారు. ఎట్టకేలకు ఈ సినిమా విడుదలై ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ సినిమాలో రొమాన్స్ తప్ప స్టోరీ ఎక్కడా లేకపోవడంతో ప్రేక్షకులు ఈ సినిమాను నేలకేసి కొట్టారు. దీంతో ఈ సినిమా ఎక్కడ తెరమీద కనిపించకుండా పోయింది. కానీ శృంగార భరితమైన సీట్ల విషయానికొస్తే డిగ్రీ కాలేజ్  సినిమా మొదటి స్థానంలో ఉంటుంది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: