టాలీవుడ్ లో మెగా ఫ్యామిలీకి మంచి గుర్తింపు ఉంది. కొణిదెల వారి ఫ్యామిలీనుండి వచ్చిన ప్రతి హీరో తనకంటూ ప్రత్యేక ముద్రను వేసుకుంటూ అభిమానులను సొంతం చేసుకుంటున్నారు. చిరంజీవి తన స్వయం కృషితో మెగాస్టార్ లెవల్ కి ఎదిగిపోయి తన వెనుకటి తరానికి తానూ ఓ కల్పవృక్షముగా తయారయ్యారు. ప్రతుతం మెగాకంపౌండ్ నుండి వస్తున్న హీరోస్ అంతాకూడా ఇప్పుడు అయన సృష్టించిన నీడలో తమ టాలెంట్ కి సానబెడుతున్నారు. చిరంజీవి పెద్ద తమ్ముడు నాగబాబు కి ఓ గొప్ప ప్రొడ్యూసర్ ని చేసిన ఘనత చిరంజీవిది. అదేవిధంగా మెగా వృక్షం నుండి వచ్చిన మరో నటుడు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ మొదట అన్నచాటు తమ్ముడు అయినా ఆతరువాత తనకంటూ ఉన్న ప్రత్యేక టాలెంటుతో ఎదిగి మెగా పవర్ స్టార్ అయ్యారు.

IHG

ఈయన కూడా నాగబాబుగారికి ఏదొక విషయంలో తన సహాయాన్ని అందిస్తూనే ఉంటారు. నేడు అంతర్జాతీయ అన్నదమ్ముల దినోత్సవం సందర్భంగా నాగబాబు తన సోదరులకు అన్నదమ్ముల దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేశారు. అయితే ఈ సందర్భంగా నాగబాబు తన సోదరులతో ఉన్న అవినాభావ సంభందాన్ని గుర్తుచేసుకున్నారు. ఈ సందర్భంగా అయన తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేస్తూ ..." ఈ బ్రదర్స్ దినోత్సవాన్ని జరుపుకోవడం నాకు గర్వకారణమైన రోజు. ఈ సందర్భంగా నా విజయోపజయలలో నన్ను అంటిపెట్టుకుని నాకు అండగా నిలిచిన నా సోదరులు @KChiruTweets  మరియు @pawan kalyan లకు కృతజ్ఞతలు మరియు వారికీ నా.. హ్యాపీ బ్రదర్స్ డే శుభాకాంక్షలు .."  అంటూ తెలిపారు . ఈ పోస్ట్ ని చూసి మెగా అభిమానులు తెగ ముచ్చటపడిపోతున్నారు...ఈ సందర్భంగా మెగా ఫాన్స్ మెగా కుటుంబానికి శుభాకాంక్షలు తెలియజేశారు .

 

మరింత సమాచారం తెలుసుకోండి: