తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో సినిమాలు వస్తుంటాయి పోతుంటాయి. కానీ కొన్ని సినిమాలు మాత్రం ప్రేక్షకులకు ఎప్పుడు ఫేవరేట్ గా ఉంటాయి. కారణం ఆ సినిమాలో ఉండే కొన్ని సీన్లు. ఈ మధ్యకాలంలో తెలుగు ప్రేక్షకులు కూడా ఘాటు రొమాన్స్ కు ఎక్కువగా అలవాటు పడుతున్న విషయం తెలిసిందే. ఏదైనా సినిమాలో ఘాటు రొమాన్స్ లేదు ఉంటే కాస్త హర్ట్ అవుతున్నారు కూడా . తెలుగు సినిమాల్లో ఘాటు రొమాన్స్ పెట్టడానికి అటు  దర్శకనిర్మాతలు కూడా గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నాడు. స్టార్ హీరోల దగ్గర నుంచి చిన్న హీరోల సినిమాల వరకు అన్ని సినిమాల్లో... ఘాటైన శృంగారభరితమైన సన్నివేశాలు ఉండాల్సిందే. ఎందుకంటే అలాంటి సన్నివేశాలు ఉంటే అటు సినిమాలకు కూడా కలిసొచ్చే అవకాశం ఉంది. 

 


 ఇక పాత్ర డిమాండ్ చేస్తే అటు  హీరో హీరోయిన్లు కూడా అలాంటి సన్నివేశాల్లో నటించడానికి వెనకాడటంలేదు. అయితే ఇలాంటి ఒక సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి  అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆ సినిమానే మన్మధుడు 2. నాగార్జున హీరోగా నటించిన మన్మధుడు సినిమా తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంత ఘనవిజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక మన్మధుడు సినిమా తర్వాత ఎన్నో ఏళ్ల కి రీసెంట్ గా మన్మధుడు 2 సినిమా తెరకెక్కించారూ. ఈ సినిమా కూడా ఘనవిజయం సాధించడం ఖాయం అని అనుకున్నారు. ఈ సినిమాలో నాగార్జున సీనియర్ హీరో అయినప్పటికీ యువ హీరోల కంటే ఎక్కువగా రెచ్చిపోయారు. 

 

 ముఖ్యంగా నాగార్జున హీరోయిన్ ల మధ్య  ఉండే లిప్లాక్ సన్నివేశాలు ప్రేక్షకులను సైతం ఆశ్చర్య పరిచాయి అని చెప్పాలి. ఐదు పదుల వయస్సు దాటినప్పటికీ నాగార్జున ఇంకా లిప్ లాక్ కిస్ చేయడానికి వెనుకడుగు వేయడం లేదు. ఇక ఈ సినిమాలో నాగార్జున హీరోయిన్ లతో చేసే రొమాన్స్ కాస్త ఘాటుగానే ఉంటుంది అని చెప్పాలి . ఏకంగా ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోలు యువ హీరోలకు సైతం సాధ్యం కాని రీతిలో రొమాంటిక్ సన్నివేశాల్లో నటించి అందరిని ఆశ్చర్యపరిచాడు నాగార్జున. ఇక ఈ సినిమా ఎన్నో అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ అంతగా ప్రేక్షకుల ఆదరణ మాత్రం పొందలేకపోయింది.  నాగార్జున  అలాంటి శృంగారభరితమైన సన్నివేశాల్లో  నటించడంతో విమర్శలు కూడా వచ్చాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: