యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సినిమా కోసం అభిమానుల లెక్కలన్నీ మారిపోతున్నాయి. బాహుబలితో వచ్చిన పాన్ ఇండియా క్రేజ్ కు తగ్గట్టుగా ప్రభాస్ సినిమాలు ఎక్కువగా రావాలనేది వారి అభిప్రాయం. కానీ.. ఇందుకు భిన్నంగా ఆయన సినిమాలు లేట్ అవుతున్నాయి. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ లో ఓర్పు తగ్గిపోతోంది. యూవీ క్రియేషన్స్ పరోక్ష యుద్ధానికి దిగుతున్నారు. దాదాపు నెల క్రితం ‘బ్యాన్ యూవీ క్రియేషన్స్’ అనే హ్యాష్ ట్యాగ్ తో యూవీ బ్యానర్ ను చీల్చి చెండాడేశారు. ఇప్పుడు మళ్లీ ప్రభాస్ ఫ్యాన్స్ తమ అసహనాన్ని మరింత ఎక్కువగా చూపిస్తున్నారు.IHG

 

ఈసారి ‘వరస్ట్ బ్యానర్ యూవీ క్రియేషన్స్’ పేరుతో మరో హ్యాష్ ట్యాగ్ క్రియేట్ చేసి ప్రభాస్ పై అభిమానాన్ని, యూవీ క్రియేషన్స్ పై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ‘ప్రభాస్ క్రేజ్ ను మీరే తగ్గించేస్తున్నారు. ఎప్పుడో అనౌన్స్ మెంట్ జరిగిన సినిమాకు ఇంతవరకూ ఫస్ట్ లుక్ ఇవ్వకపోవడం దారుణం’ అంటూ తమ కామెంట్లు, పోస్టులు చేస్తున్నారు. గతంలో హ్యాష్ ట్యాగ్ పై స్పందించిన యేవీ క్రియేషన్స్ ప్రస్తుత హ్యాష్ ట్యాగ్ పై ఇంకా స్పందించ లేదు. ఈ హ్యాష్ ట్యాగ్ ద్వారా 1మిలియన్ ట్వీట్స్ చేయాలనేది ఫ్యాన్స్ ఆలోచనగా తెలుస్తోంది.

IHG

 

యూవీ క్రియేషన్స్ లో ప్రభాస్ కు కూడా వాటా ఉందన్న విషయం తెలసిందే. అయినా.. ఫ్యాన్స్ ఆగ్రహం చల్లారటం లేదు. మొన్నామధ్య దర్శకుడు రాధాకృష్ణసినిమా పూజా కార్యక్రమాల ఫోటోలు రిలీజ్ చేసినా అవి ఫ్యాన్స్ ను ఏమాత్రం ఆకట్టుకోలేకపోయాయి. ప్రభాస్ ఫస్ట్ లుక్ రివీల్ చేయాల్సిందే అనే డిమాండ్ తప్ప వారు మరే అప్డేట్ ను యాక్సెప్ట్ చేసేలా లేదు. మరి యూవీ క్రియేషన్స్ ఎలా స్పందిస్తుందో ప్రభాస్ ఫ్యాన్స్ ఆగ్రహాన్ని ఎలా చల్లారుస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: