లాక్ డౌన్ కంప్లీట్ అవడం ఆలస్యం.. జనాలకు మ్యాగ్జిమమ్ ఎంటర్ టైన్ మెంట్ అందించాలనుకుంటున్నారు బాలీవుడ్ స్టార్లు. బ్యాక్ టు బ్యాక్ మూవీస్ తో ఆడియన్స్ ను మెప్పించేందుకు సిద్ధమవుతున్నారు. ఒక్కొక్కళ్లు ఐదు, ఆరు సినిమాలతో బరిలో దిగుతున్నారు. 


బాలీవుడ్ లో ఫుల్ స్పీడ్ గా సినిమాలు చేసే వాళ్లలో ముందుంటాడు అక్షయ్ కుమార్. ఏడాదికి మూడు, నాలుగు సినిమాలతో బాక్సాఫీస్ దగ్గర సందడి చేస్తుంటాడు. కానీ ఈ ఏడాది ఇప్పటి వరకు ఒక్క సినిమా కూడా రిలీజ్ చేయలేదు. అయితే లాక్ డౌన్ ముందు వరకు ఒక్క సినిమా కూడా రిలీజ్ కాకపోయినా.. పోస్ట్ లాక్ డౌన్ మాత్రం బ్యాక్ టు బ్యాక్ మూవీస్ తో సందడి చేయాలనకుంటున్నాడు అక్షయ్. 

 

అక్షయ్ కుమార్ ఈ సమ్మర్ లో రెెండు సినిమాలు రిలీజ్ చేయాల్సి ఉంది. కానీ లాక్ డౌన్ తో వీటిలో ఒక్కటి కూడా రిలీజ్ కాలేదు. రోహిత్ శెట్టి దర్శకత్వంలో నటించిన పోలీస్ స్టోరీ సూర్యవంశీ, రాఘవ లారెన్స్ దర్శకత్వంలో చేసిన లక్ష్మీబాంబ్ ఈ వేసవికి రావాల్సి ఉంది. కానీ థియేటర్లు మూతపడటంతో ఈ రెండు సినిమాలు పెట్టెల్లోనే ఉండిపోయాయి. 

 

సూర్యవంశీ, లక్ష్మీబాంబ్ తో పాటు మరో నాలుగు సినిమాలు లైన్లో ఉన్నాయి. హిస్టారికల్ డ్రామా పృథ్వీరాజ్, రొమాంటిక్ స్టోరీ అంత్ రంగీతో పాటు బచ్చన్ పాండే, బెల్ బాటమ్ సినిమాలున్నాయి. లాక్ డౌన్ ఎత్తివేయగానే షూటింగ్ స్టార్ట్ చేసి ఈ సినిమాలన్నింటినీ నెలల గ్యాప్ లో రిలీజ్ చేయాలనుకుంటున్నాడు అక్షయ్ కుమార్. 

 

థియేటర్లు ఓపెన్ అయిన తర్వాత ఆడియన్స్ మునుపటిలా సినిమాలకు వస్తారా.. సోషల్ డిస్టెన్స్ అంటూ రావడం మానేస్తారా అనే డౌట్ లు చాలామందికి ఉన్నాయి. అయితే పరిస్థితులు చక్కబడి, సినిమాలో కంటెంట్ ఉంటే ఆడియన్స్ ఆటోమెటిక్ గా థియేటర్లకు వస్తారని నమ్ముతున్నారు మేకర్స్. 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: