టాలీవుడ్ లో ఇప్పుడు పుష్ప సినిమా ఒక క్రేజ్ ని క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. ఇందుకు కారణం స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ తాను ఈ యేడాది సంక్రాంతికి నటించిన అల వైకుంఠపురము లో సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యి బన్నీ ని ఎక్కడో కూర్చో పెట్టేసింది. ఇప్పుడు బన్నీ క్రేజ్ అందుకునేందుకు మిగిలిన స్టార్ హీరోలు ఎంతో ప్రయాస పడాలి. ఇక అటు రంగస్థలం తర్వాత సుకుమార్ చేస్తోన్న సినిమా పుష్ప. ఈ సినిమా ఫస్ట్ లుక్ బయటకు వచ్చిన తర్వాత ప్రేక్షకులు సినిమా అగురించి ఏ వార్త వచ్చినా సరే ఆసక్తికరంగా చదువుతున్నారు. ఈ సినిమా షూటింగ్ లాక్ డౌన్ కారణంగా వాయిదా పడింది. ఎప్పుడు షూటింగ్ మొదలుపెట్టే అవకాశం ఉంది అనేది ఇంకా స్పష్టత రావడం లేదు.
ఈ సినిమా షూటింగ్ ని త్వరలోనే మొదలు పెట్టే అవకాశాలు కనపడుతున్నాయి. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాలో అల్లు అర్జున్ కుడా పెట్టుబడి పెడుతున్నట్టు సమాచారం. భార్య స్నేహా రెడ్డి సూచనతో బన్నీ ఈ సినిమాలో పెట్టుబడి పెడుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా షూటింగ్ మొదలైన తర్వాత బన్నీ నుంచి కూడా అధికారిక ప్రకటన వచ్చే సూచనలు కనపడుతున్నాయి. ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకి రానుంది.
ఇక ఈ సినిమాలో నటుల ఎంపిక కూడా ఇప్పుడు జరుగుతుంది. కీలక నటులను ఈ సినిమాకు ఎంపిక చేస్తున్నారు. ఒక పాత్రకు గానూ సుమ ను తీసుకునే అవకాశం ఉందని సమాచారం. ఆమె కూడా అందుకు ఓకే చెప్పిందని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. సినిమా షూటింగ్ మొదలైన తర్వాత ఆమె సినిమాలో ఉంటుంది అని ప్రకటన చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. మరి ఆమె ఏ పాత్ర చేస్తుందో చూడాలి. ఈ సినిమా గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో నడుస్తుందట.