‘నా పేరు సూర్య’ అట్టర్ ఫ్లాప్ తర్వాత బన్నీ దాదాపు ఏడాదిన్నర కి పైగా గ్యాప్ తీసుకోవటం అందరికీ తెలిసిందే. ఆ సమయంలో అనేక మంది డైరెక్టర్లు చెప్పిన కథలు విన్న బన్నీ ఎట్టకేలకు తనకు గతంలో రెండు హిట్లు ఇచ్చిన త్రివిక్రమ్ సినిమా ‘అలా వైకుంఠపురం లో’ ఓకే చేయడం జరిగింది. అతి తక్కువ టైమ్ లోనే సినిమా కంప్లీట్ చేసి ఈ ఏడాది సంక్రాంతి పండుగకు అదిరిపోయే బ్లాక్ బస్టర్ విజయాన్ని బన్నీ అందుకున్నాడు. ఏకంగా టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర నాన్ బాహుబలి రికార్డులను బద్దలుకొట్టి సరికొత్త రికార్డులు సృష్టించాడు. ప్రస్తుతం బన్నీ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో 'పుష్ప' అనే సినిమా చేస్తున్నా విషయం మనకందరికీ తెలిసిందే.

 

ఇటీవల బన్నీ పుట్టినరోజునాడు ఈ సినిమాకి సంబంధించి పోస్టర్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. మాస్ కథాంశం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బన్నీ లారీ డ్రైవర్ గా నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉండగా 'ఐకాన్' అనే సినిమా కూడా బన్నీ ఓకే చేసిన విషయం అందరికీ తెలిసిందే. కాగా తాజాగా ఇండస్ట్రీలో ఇప్పటివరకు పరాజయం లేని బ్లాక్ బస్టర్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో బన్నీ సినిమా ఓకే చేసినట్లు ఇండస్ట్రీలో వార్తలు వినపడుతున్నాయి. ఇటీవల కొరటాల శివ అల్లు అర్జున్ కి స్టోరీ లైన్ వినిపించినట్లు.. బాగుందని మొత్తం స్క్రిప్ట్ అంతా ప్రిపేర్ చేసుకుని కొరటాల ని రమ్మన్నారని ఇండస్ట్రీలో వార్తలు బలంగా వినపడుతున్నాయి. 

 

ప్రస్తుతం కొరటాల శివ మెగాస్టార్ చిరంజీవి తో 'ఆచార్య' అనే సినిమాని తెరకెక్కిస్తున్నారు. త్వరలోనే అనగా జూన్ నెల నుండి ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ మొదలు కానున్నట్లు వార్తలు వస్తున్నాయి. అక్టోబర్ కి సినిమాకి సంబంధించి షూటింగ్ మొత్తం పూర్తిచేసి రిలీజ్ చేయాలని కొరటాల మరియు చిరంజీవి అనుకుంటున్నట్లు సమాచారం. ఇదే సమయంలో అటు డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో 'పుష్ప' సినిమా కంప్లీట్ అయిన వెంటనే కొరటాల శివ సినిమా ఓకే అయితే 'ఐకాన్' కంటే ముందే బన్నీ కోరటాల సినిమా చేసే అవకాశం ఉందని ఫిలిం నగర్ టాక్. 

మరింత సమాచారం తెలుసుకోండి: