ప్రేమకథలు తీయాలంటే అది ఆయన తర్వాతే ఎవరైనా అన్నట్టుగా క్రేజ్ తెచ్చుకున్న తేజా తను తీసిన ప్రతి ప్రేమకథని ప్రేక్షకులు మెచ్చేలా చేశాడు. ఇక అందులో నితిన్, సదా జంటగా వచ్చిన సూపర్ సక్సెస్ ఫుల్ మూవీ జయం. తేజా దర్శక నిర్మాణంలో వచ్చిన ఈ సినిమాలో నితిన్, సదాల లవ్ స్టోరీ మాత్రమే కాదు ప్రేమ ని ఎక్స్ ప్రెస్ చేసే విధానంలో లీడ్ పెయిర్ మధ్య రొమాన్స్ కూడా బాగా వర్క్ అవుట్ అయ్యింది. ఈ సినిమాకు ముందు నువ్వు నేను సినిమాతో హిట్ అందుకున్నాడు తేజా. 

 

సినిమా తర్వాత వెంటనే జయంతో హిట్ కొట్టాడు. జయం సినిమాతో నితిన్ తెరంగేట్రం చేశాడు. అప్పటి నుండి లవర్ బోయ్ గా నితిన్ తన సత్తా చాటుతున్నాడు. నితిన్, సదా రొమాన్స్ కూడా జయం సినిమాకు హైలెట్ గా నిలిచింది. రొమాన్స్ అంటే ఇష్టమైన వారికి దగ్గరవడం.. వాళ్లతో మాట్లాడేలా ప్రయత్నించడం కూడా రొమాన్స్ లో భాగమే. జయం సినిమాలో నితిన్, సదాల రొమాన్స్ కూడా ఇలానే ఉంటుంది. ప్రియతమా తెలుసునా నా మనసు నీదేనని.. పాటలో ఇంటి పైకప్పు తీసి తాడుతో హీరోయిన్ బెడ్ రూమ్ లోకి వచ్చి చేసే రొమాన్స్ ఇదివరకు ఏ సినిమాలో చూడలేదు. అందుకే ఆ సినిమా సూపర్ హిట్ అయ్యింది. 

 

కెరియర్ లో మొదటి సినిమాతోనే హిట్ కొట్టాడు నితిన్. ఈ సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన సదా కూడా టాలీవుడ్ లో సూపర్ క్రేజ్ తెచ్చుకుంది. అయితే తర్వాత తేజా రొటీన్ లవ్ స్టోరీస్ తీయడంతో వరుస ప్లాపులు అందుకున్నాడు. మళ్ళీ రానాతో తీసిన నేనే రాజు నేనే మంత్రి సినిమాతో సత్తా చాటాడు.               

మరింత సమాచారం తెలుసుకోండి: