షూటింగ్స్ చేసుకోవడానికి ఎప్పుడెప్పుడు అనుమతిస్తారా.. అని అటు సినిమాలు.. అటు టీవీ సీరియల్స్ ఎదురు చూస్తున్నాయి. లాక్ డౌన్ పూర్తి కాగానే.. జూన్ ఒకటి నుంచి షూటింగ్స్ కు పర్మీషన్ ఇచ్చినా.. మన స్టార్స్ నటించేందుకు సిద్ధంగా లేరు. ఇప్పట్లో వద్దంటున్నారట. కరోనా భయం మనవాళ్లను వెంటాడుతున్నట్టు తెలుస్తోంది. 

 

షూటింగ్స్ ఎపుడు స్టార్ట్ చేయాలి. థియేటర్స్ ఎప్పుడు ఓపెన్ చేయాలి. కరోనా పరిస్థితుల్లో ఎదుర్కోవాల్సిన సవాళ్లపై చర్చించేందుకు తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి srinivas YADAV' target='_blank' title='తలసాని శ్రీనివాస్ యాదవ్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>తలసాని శ్రీనివాస్ యాదవ్ అధ్యక్షతన చిరంజీవి ఇంట్లో సమావేశం జరిగింది. సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకోవడానికి అనుమతి ఇచ్చేశారు. ముఖ్యమంత్రితో సంప్రదించి షూటింగ్స్ పై.. థియేటర్స్ ఓపెనింగ్ పై ఓ నిర్ణయం తీసుకుంటామన్నారు మంత్రి. ఓ పది, పదిహేను రోజుల్లో షూటింగ్స్ కు అనుమతి ఇచ్చినా.. కొందరు స్టార్స్ సంసిద్దంగా కనిపించడం లేదు. 

 

లాక్ డౌన్ కొనసాగుతున్నా.. చాలా సడలింపులు అటు కేంద్రం.. ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చాయి. మరోవైపు కేసులు ఏమాత్రం తగ్గలేదు. షూటింగ్స్ మొదలైనా.. కరోనా భయం వెంటాడటంతో సెట్స్ పైకి రావడానికి హీరోలు ఇంట్రెస్ట్ చూపించడం లేదట. హీరోలే ఇలా ఉంటే.. ఇక హీరోయిన్స్ ముందుకొస్తారా.. వాళ్లు కూడా.. ఇప్పట్లో సెట్స్ పైకి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. కరోనా ఎప్పుడు తగ్గుతుందో ఎవ్వరూ చెప్పలేకపోతున్నారు. ఈ క్రమంలో వ్యాక్సిన్ వచ్చే దాకా వెయిట్ చేద్దామన్న ఉద్దేశంలో పెద్ద హీరోలు ఉన్నారట. 

 

స్టార్స్ సెట్స్ లోకి రాకపోతే.. సినిమాలు ఇప్పట్లో పూర్తి కావు. రెండున్నర గంటల సినిమాలో హీరోనే 2గంటలు కనిపిస్తాడు. హీరో లేని సీన్స్ తీసినా.. చాలా బ్యాలెన్స్ ఉంటుంది. కరోనా వ్యాక్సిన్ వచ్చిన తర్వాతే కెమెరా ముందుకు రావాలని పార్టీ డిసైడ్ అయితే.. అది ఎప్పుడు వస్తుందో.. ఎప్పుడు షూటింగ్ లో పాల్గొంటారో తెలియని గందరగోల పరిస్థితిలో సినిమా ఇండస్ట్రీ ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: