పోసాని క్రిష్ణ మురళి. మంచి టాలెంట్ ఉన్న రచయిత, దర్శకుడు, ఆ మీడట మంచి నటుడు, ఆయన టైమింగ్ తో కూడిన కామెడీ ఆడియన్స్ ని పొట్టచక్కలయ్యేలా నవ్విస్తుంది. పోసాని టాలీవుడ్లో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న కళాకారుడు. ఇక ఆయనలో సామాజిక స్ప్రుహ ఎక్కువే. ఆయన సినిమాల్లో రాసిన రచనలు ఆ సంగతి చెబుతాయి.

 

రాజకీయాల్లోకి వచ్చి ఆయన చిలకలూరిపేట నుంచి ప్రజారాజ్యం తరఫున 2009 ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. ఆ తరువాత రాజకీయం వదిలేశారు. అయితే ఆయన వైఎస్సార్ అభిమానిగా ఉన్నారు. జగన్ తో కూడా సన్నిహితుడిగా మెలిగారు. తాజాగా ఆయన జగన్ ఏడాది పాలనను మెచ్చుకున్నారు. జగన్ వన్ మ్యాన్ ఆర్మీ అనేశారు.

 

ఆయన దేశంలో ఎక్కడా ఎవరూ చేపట్టని విధంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతూ వచ్చారని, కరోనా సంక్షోభ వేళ కూడా ఆయన తనకు తానే సాటిగా నిలిచారని అన్నారు. ఈసారి ఎన్నికల్లో తామెవరూ జగన్ కి ఓటేయమని ప్రచారం చేయనవసరం లేదని, ప్రజలే జగన్ని కోరి మరీ ఎన్నుకుంటారని కూడా పోసాని అన్నారు.

 

మొత్తానికి నిబధ్ధత కలిగిన  నాయకుడిగా పోసానిని చెప్పుకోవాలి. ఎంతో మంది సినీ నటులు జగన్ పార్టీలో చేరారు. కానీ ఎవరూ కూడా జగన్ని ఇలా పొగడలేదు, ఆయన వెంట ఈ రోజు వరకూ ఉన్నదీ లేదు. జగన్ పదవులు ఇస్తారని ఆశలు పెట్టుకున్న వారే ఎక్కువగా  ఉన్నారు. అయితే జగన్ తన పధ్ధతిలో తాను పనిచేసుకుపోతున్నారు, అంతే తప్ప ఈ మెప్పులు, గొప్పలు ఆయన పట్టించుకోవడంలేదు.

 

ఇవన్నీ పక్కన పెడితే పార్టీలో అందరి కంటే ముందు చేరిన పోసాని జగన్ కోసం మీడియాలో నాటి నుంచి నేటి వరకూ పోరాడుతూనే ఉన్నారు. మరి జగన్ ఆయన్ని గుర్తించి ఏదినా పదవి ఇస్తారా. లేక పదవులు అవసరం లేదని పోసాని ఇలాగే పార్టీ అభిమానిగా ఉంటారా. చూడాలి మరి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: