నిధీ అగర్వాల్ ...అక్కినేని అన్నదమ్ములతో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసి ఇండస్ట్రీ దృష్ఠిని ఆకట్టుకుంది. అందం అభినయం పరంగా మంచి పేరు సంపాదించుకుంది. కాని ఈ రెండు సినిమాలు హిట్ అవకపోవడంతో నిధీ కి ఇక సినిమాలు రావేమో అనుకున్నారు అందరు. కాని పూరి షాకిచ్చాడు. రాం పోతినేని హీరోగా తెరకెక్కిన ఇస్మార్ట్ శంకర్ సినిమాలో నిధీని సెలెక్ట్ చేసుకున్నాడు. అలాగే నన్ను దోచుకుందువటే సినిమాతో హీరోయిన్ గా మంచి పేరు తెచ్చుకున్న నభా నటేష్ ది ఇదే పరిస్థితి. సుధీర్ బాబు నటించిన ఈ సినిమాకి విమర్శకుల ప్రశంసలు దక్కినప్పటికి కమర్షియల్ హిట్ మాత్రం సాధించలేకపోయింది. 

 

దాంతో నభా కి తెలుగులో ఇక అవకాశాలు రావడం కష్టమే అనుకున్నారు. కాని పూరి ఊహించని విధంగా నభా కి గోల్డెన్ ఛాన్స్ ఇచ్చాడు. ఈ ఇద్దరు కలిసి ఇస్మార్ట్ శంకర్ లో దున్నేశారు. ఒకరు పక్కా మాస్, ఒకరు పక్కా క్లాస్ హీరోయిన్స్ గా నటించినప్పటికి గ్లామర్ విషయంలో మాత్రం ఇద్దరు ఒకే రకమైన క్రేజ్ ని దక్కించుకున్నారు. చెప్పాలంటే తెలుగులో సక్సస్ లు లేని ఇద్దరు ముద్దుగుమ్మలకి పూరి మంచి లైఫ్ ఇచ్చాడు. ఇప్పుడు ఈ ఇద్దరు వరసగా సినిమాలు చేస్తూ టాప్ ప్లేస్ కోసం పోటీ పడుతున్నారు. నభా నటేష్ రవితేజ సరసన డిస్కోరాజా లో నటించింది. 

 

ఇప్పుడు తన చేతిలో రెండు సినిమాలున్నాయి. వాటిలో ఒకటి మెగా హీరో సాయి ధరం తేజ్ నటిస్తున్న సోలో బ్రతుకే సో బెటరు కాగా మరో సినిమా బెల్లంకొండ శ్రీనివాస్ అల్లుడు అదుర్స్. ఈ సినిమాని కందిరీగ ఫేం సంతోష్ శ్రీనివాస్ తెరకెక్కిస్తున్నాడు. ఇక నిధీ అగర్వాల్ సూపర్ స్టార్ మహేష్ బాబు అల్లుడు గల్లా అశోక్ డెబ్యూ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే మాస్ మహారాజా రవితేజ రమేష్ వర్మ కాంబినేషన్ లో రూపొందనున్న కొత్త సినిమాలో నిధీ అగర్వాల్ ఫైనల్ అయింది.  ఈ సినిమాలతో పాటు లక్ష్మణ్ అనే యంగ్ డైరెక్టర్ తెరకెక్కిస్తున్న భూమ్ అనే తమిళ సినిమాలోను నటిస్తుంది. మొత్తానికి ఇద్దరు ఇస్మార్ట్ బ్యూటీస్ కి పూరి మంచి లైఫ్ ఇచ్చాడు.  

మరింత సమాచారం తెలుసుకోండి: