కొందరు దర్శకులకు కొందరు హీరోయిన్లు బాగా నచ్చేస్తారు.. యాక్టింగ్ ఓ, అందమో, డ్యాన్స్ ఓ ఇలా ఏదో ఒక విధంగా నచ్చేస్తారు. అలా నచ్చి కంబినేషన్స్ రిపీట్ చేస్తారు. అలానే అప్పట్లో ఇలియానా అంటే పూరి జగన్నాథ్ కి చాలా ఇష్టం అని, శ్రీదేవి అంత హీరోయిన్ తర్వాత ఇలియానా నే అని ఓ ప్రముఖ ఆంగ్ల పత్రికలో కూడా వచ్చింది. 

 

అలా ఎందుకు వచ్చింది అంటే?  పూరి జగన్నాథ్ ఇలియానాతో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు సినిమాలు చేశాడు. మొదటి సినిమా పోకిరి సూపర్ హిట్. కానీ ఈమె పాత్ర అంత గొప్పగా లేదు.. ఏదో హీరోయిన్ ఉండాలి అంటే ఉండాలి అనే రేంజ్ లో సినిమా ఉండేది. కానీ సినిమా సూపర్ హిట్ అయ్యింది కదా! అందుకే పూరి మనసులో ఉండిపోయింది. 

 

ఇంకా ఆతరవాత కొన్ని అడపా దడపా సినిమాలు చేసింది. కానీ అవి కూడా పెద్దగా ఓకే అవ్వలేదు. అందుకే ఇలియానా పాత్ర కొంచం అందంగా కొంచం హైప్ ఉండేలా నేను నా రాక్షసి సినిమా చేశాడు. అది కూడా పెద్దగా హిట్ కాలేదు. కానీ ఆతర్వాత లాస్ట్ అండ్ ఫైనల్ అని దేవుడు చేసిన మనుషులు తీశాడు. అది కూడా ప్లాప్ ఏ. 

 

ఇలా తీసిన మూడు సినిమాల్లో ఒకటి సూపర్ హిట్ అయ్యింది. మిగితా రెండు అట్టర్ ప్లాప్ అయ్యాయి. సినిమాలో ఉన్నది స్టార్ హీరోస్ అయినప్పటికీ సినిమాలు అట్టర్ ప్లాప్ అయ్యాయి. ఏది ఏమైతేనేం.. భవిష్యత్తులో అయినా వీరి ఇద్దరి కాంబినేషన్ లో సినిమాలు వస్తాయి ఏమో చూద్దాం.                                    

మరింత సమాచారం తెలుసుకోండి: