అవును.. నిజంగానే రక్షిత, పూరి జగన్నాథ్ కలిసి చాలా సినిమాలు చేశారు. రక్షిత ఇప్పుడు అంటే చాలా లావుగా బొద్దుగా తయారయ్యింది కానీ అప్పట్లో ఎంతో అందంగా, కుర్రాళ్ళు మతులు పొయ్యేంత రొమాంటిక్ గా ఉండేది రక్షిత. ఇంకా అప్పట్లో చాలా సినిమాల వరుకు హిట్ అయ్యాయి. అప్పట్లో సక్సెస్ రేట్ ఉన్న హీరోయిన్స్ లో ఆమె ఒకరు. 

 

అందుకే పూరి జగన్నాథ్ ఆమెకు ఎంతో మంచి రోల్ ఇచ్చి సినిమాలు చేశాడు. అలా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఐదుకు పైగా సినిమాల్లో ఆమెను హీరోయిన్ గా పెట్టి తీశాడు. ఆమెను హీరోయిన్ గా పెట్టిన అన్ని సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి లెండి. ఇప్పటికి ఆ సినిమాలు టీవిలో వస్తే ఓ రేంజ్ లో టీఆర్పీ వస్తుంది. 

 

ఆ సినిమానే ఇడియట్.. అదే రవితేజ హీరోగా రక్షిత హీరోయిన్ గా తీసిన సినిమా. ఏం కమిషనర్ కూతుర్లకు మొగుళ్ళు రారా? పెళ్లిళ్లు కావా ? అనే డైలాగ్ హిట్ అయ్యింది కదా! అది ఈ సినెమాలోదే. ఇంకా ఈ సినిమానే కన్నడలో ''అప్పు'' అని రీమేక్ చేశారు. అక్కడ కూడా రక్షితనే హీరోయిన్.. ఈ సినిమా అక్కడ సూపర్ హిట్టే. 

 

ఇంకా ఆ తర్వాత శివమణి సినిమాలో సెకండ్ హీరోయిన్ గా తీసుకున్నారు. ఆ సినిమాను సూపర్ హిట్ అయ్యింది. ఇప్పటికి ఎవరైనా శివమణి అని పేరు పెట్టుకుంటే పూరి జగన్నాథ్ శివమణి నా అని అడుగుతారు. ఆ రేంజ్ లో సినిమా హిట్ అయ్యింది. ఇంకా ఆ తర్వాత ఆంధ్రావాలా సినిమాలో హీరోయిన్ గా తీసుకున్నారు. అయితే ఈ సినిమా ఒక్కటి అట్టర్ ప్లాప్ అయ్యింది. ఇలా రక్షితను హీరోయిన్ గా పెట్టి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు సినిమాలు చేశాడు పూరి జగన్నాథ్.

మరింత సమాచారం తెలుసుకోండి: