భానుమతి.. హైబ్రిడ్ పిల్లా.. ఒక్కటే పీస్ అంటూ వచ్చిన ఈ హైబ్రిడ్ పిల్ల సాయి పల్లవి అందరిని ఒకే ఒక్క సినిమాతో ఫిదా చేసేసింది. ఫిదా సినిమాలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ భామ నటన, అందం, డ్యాన్స్ అందరిని ఆకట్టుకుంటాయి. అసలు నిజం చెప్పాలి అంటే మన సాయి పల్లవి పెద్ద అందగత్తే కాదు కానీ మంచి నటి. 

 

ఇంకా ఆమె ఎప్పుడు అందంకి సంబంధించిన పాత్రలకు ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. పాత్రకు మాత్రమే ప్రాధాన్యత ఇచ్చింది. అందుకే సాయి పల్లవికి ప్రేక్షకుల నుండి ఒక మంచి రెస్పెక్ట్. అంతేకాదు తాను సినిమాలో హీరోయిన్ అంటే ఎక్సపోజ్ కోసం పోరు.. మంచి పాత్ర ఉంటుంది అని వెళ్తారు. అలానే తను తీసిన అన్ని సినిమాల్లో ఎంతో మంచి పాత్రలో నటించింది. 

 

ఇకపోతే మన టాలీవుడ్ కి పరిచయం అవ్వకముందు మలర్ గా అందరికి తెలిసినప్పటికీ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది మాత్రం భానుమతిలానే. ఫిదా అంటూ శేఖర్ కమ్ముల తీసిన ఈ సినిమా ఎంత పెద్ద హిట్టో చెప్పాల్సిన అవసరం లేదు. మంచి ఫీల్ వచ్చేలా సినిమా తీసి భానుమతి పాత్రని హైలెట్ చేసి అందరిని ఆకట్టుకున్నారు. 

 

ఇంకా అలాంటి భానుమతితో ఇప్పుడు మరో అద్భుతమైన సినిమా చేస్తున్నాడు శేఖర్ కమ్ముల. అదే లవ్ స్టోరీ. సినిమా చూస్తే చాలు వావ్ అనిపించే రేంజ్ లో ఆ సినిమాను తీస్తున్నట్టు గుస గుసలు వినిపిస్తున్నాయి. నిజానికి అవి గుస గుసలు కాదు.. నిజాలు. ఎందుకంటే అందులో హీరోయిన్ సాయి పల్లవి. ఇంకా దానికి దర్శకుడు శేఖర్ కమ్ముల. లాక్ డౌన్ లేకపోయింటే సినిమా ఇప్పటికి విడుదల అయ్యేది. కానీ ఈ లాక్ డౌన్ కారణంగా సినిమా కాస్త ఆలస్యంగా విడుదల అవుతుంది.      

మరింత సమాచారం తెలుసుకోండి: