కరోనా కారణంగా షూటింగ్స్ అన్నీ ఆగిపోయిన సంగతి తెలిసిందే. దాంతో త్వరలోనే తిరిగి షూటింగ్ స్టార్ట్ చేసుకోవచ్చని ప్రభుత్వం అనుమతిచ్చింది. అయితే ఇప్పటి వరకు సెట్స్ పై ఉన్న కొన్ని క్రేజీ ప్రాజెక్ట్స్ ఎంత వరకు షూటింగ్ కంప్లీట్ చేసుకున్నాయంటే.. !

 

కరోనా మహమ్మారి వ్యాప్తి చెందకుండా దేశంలో లాక్ డౌన్ విధించడంతో.. సినిమా షూటింగ్స్ అన్నీ ఆగిపోయాయి. దాంతో స్టార్లంతా రెండు నెలలకు పైగా ఇళ్లకే పరిమితమయ్యారు. అయితే సినీ పరిశ్రమను దృష్టిలో పెట్టుకొని.. ప్రభుత్వం నియమ నిబంధనలతో షూటింగ్ చేసుకోవడానికి పర్మీషన్ ఇచ్చింది. జూన్ లో షూటింగ్ లు మొదలు కానున్నాయి. 

 

అయితే ప్రస్తుతం సెట్స్ పై ఉన్న సినిమాల్లో.. ఏ సినిమా షూటింగ్ ఎంత పెండింగ్ ఉంది.. అనేది ఒకసారి పరిశీలిస్తే.. చిరు ఆచార్య.. 60శాతం, నాగార్జున వైల్డ్ డాగ్..50శాతం, వెంకీ నారప్ప.. 30శాతం.. ప్రభాస్ కొత్త సినిమా 30శాతం.. రవితేజ క్రాక్ 10శాతం.. పవన్ వకీల్ సాబ్ 25శాతం.. నాగచైతన్య లవ్ స్టోరీ.. 10శాతం, నానీ టక్ జగదీష్..60శాతం, విజయ్ దేవరకొండ ఫైటర్.. 60శాతం, గోపీచంద్ సీటీమార్..70శాతం, ఆర్ఆర్ఆర్ కొంత భాగం షూటింగ్ పూర్తి కావాల్సి ఉందట.  

 

వీటిలో 10శాతం నుంచి 30శాతం లోపు ఉన్న సినిమాలకు మాత్రం.. పోస్ట్ ప్రొడక్షన్స్ వేగంగా పూర్తి చేసేందుకు ఆస్కారం ఉంటుంది. ఇప్పటికే ప్రభుత్వం పోస్ట్ ప్రొడక్షన్స్ పనులు చేసుకోవచ్చని తెలిపింది కాబట్టి.. కొన్ని సినిమాలు ఆ పనిలో నిమగ్నమై ఉన్నాయి. మిగతా సినిమాల షూటింగ్ ఎప్పుడు మొదలు పెడతాం..ఎప్పుడు కంప్లీట్ చేస్తాం అని ఎదురు చూస్తున్నారు. 

 

అయితే ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ సినిమాలు.. అనుకున్న సమయానికి రిలీజ్ అవుతాయా.. లేదా.. అనేది ఇప్పుడే చెప్పలేం. ఎందుకంటే కరోనా కారణంగా షూటింగ్స్ అన్నీ లేట్ అయిన సంగతి తెలిసిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: