కరోనా మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా ప్రళయ తాండవం చేస్తున్న విషయం తెలిసిందే. కంటికి కనిపించని కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోంది. రోజురోజుకీ మృతుల సంఖ్య.. బాధితుల సంఖ్య పెరుగుతుండడంతో ప్రభుత్వాలు అయోమయానికి గురవుతున్నాయి. కరోనా మహమ్మారి (కోవిడ్ -19) వ్యాప్తిని నివారించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌‌ డౌన్ ఆదేశాలు జారీ చేశాయి. ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తోన్న క‌రోనా పై కేంద్ర‌ రాష్ట్ర ప్ర‌భుత్వాలు అలు పెరుగ‌ని పోరాటం చేస్తున్నాయి. అయితే లాక్ డౌన్ వలన ప్రజలందరూ ఎటువంటి ఉపాధి లేక పూర్తిగా ఇంటికే పరిమితం కావాల్సి వచ్చింది. దానితో ఇల్లు గడిచే పరిస్థితి లేక పేద, దిగువ మధ్యతరగతి కుటుంబాల వారు తీవ్ర సమస్యలు ఎదుర్కొన్నారు. అయితే గత కొన్ని రోజులుగా కొన్ని రంగాల మీద ప్రభుత్వం నిబంధనలు సడలిస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలో జాగ్రత్తలు తీసుకుంటూ కొన్ని కంపెనీలు.. షాప్స్ ఓపెన్ అవుతూ వస్తున్నాయి. అయితే లాక్‌ డౌన్‌ వలన చాలామంది వేర్వేరు ప్రాంతాల్లో.. ఇతర దేశాల్లో చిక్కుకుపోయారు. దీంతో నెలల తరబడి కుటుంబ సభ్యులను దూరంగా గడుపవలసి వచ్చింది. తమ సొంతవారిని కలుసుకోలేక సొంత ఊరికి రాలేక నానా అవస్థలు పడ్డారు. 

 

అయితే ఇప్పుడు రూల్స్ సడలిస్తూ వస్తుండటంతో జాగ్రత్తలు తీసుకుంటూ ఇతర ప్రాంతాలకు ప్రయాణాలు కూడా జరుగుతున్నాయి. ఈ క్రమంలో న్యూయార్క్‌ కు చెందిన ఓ వృద్ధ దంపతులు సుమారు రెండు నెలల తరువాత  ఒకరినొకరు కలుసుకున్నారు. కరోనా వైరస్‌ కారణంగా అనుకోకుండా ఎడబాటుకు దూరమైన ఈ దంపతులు ఆదివారం సొంత గూటికి చేరుకున్నారు. దీంతో ఆ వృద్ధ జంట ఆనందానికి అంతేలేకుండా పోయింది. రెండు నెలల తరువాత కలుసుకోవడంలో ముద్దు పెట్టుకుని ఒకరినొకరు తనవితీరా హత్తుకుని సంతోషం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారింది. దీనిపై బాలీవుడ్‌ నటి అనుష్క శర్మ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ''ఇదీ జీవితమంటే'' అంటూ ఆ జంటపై ప్రశంసలు కురిపించారు. ఇక ఇండియన్‌ టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా సైతం ఆ జంట ప్రేమకు ఫిదా అయ్యారు. ''ఇంటర్‌ నెట్‌ లో నేను చూసిన అత్యుత్తమ వీడియో'' ఇదే అంటూ కామెంట్‌ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: