కరోనా సమస్యతో లాక్ డౌన్ ప్రకటించడంతో భారతదేశంలో అన్ని రంగాలు తీవ్రంగా నష్టపోయాయి. అయితే ఈ నష్టం ఫిలిం ఇండస్ట్రీకి మాత్రం విపరీతంగా ఉంది. దీనితో ఇండస్ట్రీ ఎప్పటికి కోలుకుంటుందో ఎవరికీ అర్ధంకాని పరిస్థితి.


దీనికితోడు ఇప్పుడు నిర్మాణంలో ఉన్న సినిమాలు ఎప్పుడు పూర్తి అవుతాయో ఏ సినిమా ఎప్పుడు విడుదల అవుతుందో అన్నది ఆ సినిమాలను నిర్మిస్తున్న నిర్మాతలకు కూడ అర్ధంకాని విషయంగా మారింది. ఇలాంటి పరిస్థితులలో ఇప్పుడు నిర్మాణంలో ఉన్న ‘ఆర్ ఆర్ ఆర్’ వచ్చే ఏడాది సమ్మర్ కు వాయిదా పడటంతో ప్రభాస్ జిల్ రాధకృష్ణల ‘రాథేశ్వామ్’ మెగాస్టార్ ‘ఆచార్య’ 2021 సంక్రాంతికి విడుదలవుతాయి అని అందరు అనుకుంటూ వచ్చారు.


అయితే ఇండస్ట్రీ ఇన్ సైడ్ వర్గాల లీకుల ప్రకారం ఈ రెండు సినిమాలు కూడ సంక్రాంతికి రావడం కష్టమే అనే టాక్ వినిపిస్తోంది. మెగాస్టార్ ‘ఆచార్య’  సినిమా షూటింగ్ ఇంకా 60 రోజులకు పైగా ఉందని ఆ తరువాత ఈసినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ మరో రెండు నెలలు ఉంటుందని లీకులు వస్తున్నాయి. దీనికితోడు ఈ సినిమాలో రామ్ చరణ్ నటిస్తున్న పరిస్థితులలో  ఈసినిమాకు చరణ్ ఎప్పుడు డేట్స్ ఇస్తాడో అన్న విషయం చరణ్ కు కూడ తెలియని పరిస్థితి. ఇదే సమస్య ప్రభాస్ జిల్ రాధ కృష్ణల ‘రాథేశ్వామ్’ కు కూడ ఉందని అంటున్నారు. ఈ సినిమా షూట్ వరకు పూర్తి అయినా ఈ సినిమాకు ఎక్కువ విఎఫ్ఎక్స్ పనులు ఉన్న పరిస్థితులలో ఈ సినిమా కూడ సంక్రాంతికి రావడం కష్టమే అనిఅంటున్నారు.  


దీనితో ఇక మిగిలింది పవన్ కళ్యాణ్ 'వకీల్ సాబ్' మాత్రామే ఈ సినిమాకు సంబంధించి ఇక కేవలం 20 రోజుల షూటింగ్ మాత్రమే మిగిలి ఉండటంతో సినిమా షూటింగ్ లు ఎంత ఆలస్యంగా మొదలు అయినా ‘వకీల్ సాబ్’ రాబోయే నవంబర్ కు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడపూర్తిచేసుకుని విడుదలకు రెడీ అవుతుంది అన్న సంకేతాలు వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితులలో దిల్ రాజ్ ‘వకీల్ సాబ్’ ను వచ్చే ఏడాది సంక్రాంతికి గ్రాండ్ గా రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నట్లు తెలుస్తోంది. దీనితో ‘వకీల్ సాబ్’ కు పోటీ ఇచ్చే టాప్ హీరోల సినిమాలు ఏమి లేకపోవడంతో రానున్న సంక్రాంతికి పవన్ ఏక చత్రాధి పత్యం బాక్స్ ఆఫీస్ పై కొనసాగుతుంది అన్న అంచనాలతో దిల్ రాజ్ ఉన్నట్లు టాక్..

 

మరింత సమాచారం తెలుసుకోండి: