దర్శకధీరుడు రాజమౌళి రెండేళ్ల గ్యాప్ తీసుకొని యంగ్ టైగర్ ఎన్టీఆర్ - మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ లతో 'రౌద్రం రణం రుధిరం' చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. టాలీవుడ్ లో భారీ మల్టీస్టారర్‌ గా రూపొందుతున్న ఈ చిత్రంపై అంచనాలు ఏ రేంజ్‌ లో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో డీవీవీ దానయ్య ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. యావత్ సినీ అభిమానులు 'ఆర్.ఆర్.ఆర్' సినిమా కోసం ఎదురుచూపులు చూస్తున్నారు. అయితే ఇప్పటికే ఈ సినిమా రెండుసార్లు విడుదల తేదీలను మార్చుకుంది. చివరగా 'ఆర్.ఆర్.ఆర్' వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 8న విడుదల అవుతుందని ప్రకటించారు. అయితే ఈ మధ్య చిత్ర నిర్మాత డీవీవీ దానయ్య చెప్పిన దాని ప్రకారం ఈ సినిమా ఖచ్చితంగా మళ్ళీ వాయిదా పడే అవకాశాలున్నాయి. ఇప్పటికే చాలా భాగం చిత్రీకరణ జరుపుకున్న ఈ చిత్రం ప్రస్తుత క్రైసిస్ కారణంగా షూటింగ్ నిలుపుదల చేసుకుంది. కాకపోతే మిగిలి భాగం షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ గ్రాఫిక్ వర్క్ కంప్లీట్ చేయడానికి చాలానే సమయం పెట్టేలా ఉంది. ఇప్పుడు పరిస్థితులు చక్కబడి ఎప్పుడు షూటింగ్స్ స్టార్ట్ అవుతాయో తెలియదు.. మిగతా షూటింగ్ పూర్తి చేయడానికి జక్కన్న ఎంత సమయం తీసుకుంటాడో తెలియదు. రాజమౌళి షూటింగ్ స్టార్ట్ చేసి.. ఒకవేళ అన్ని పనులు పూర్తి చేసినా ఈ సినిమా విడుదల అవ్వబోయేది వచ్చే ఏడాది సమ్మర్ లో లేదా జూన్ జూలై లో అనే టాక్ వినబడుతోంది. 

 

తెలంగాణా ప్రాంతానికి చెందిన కొమరం భీమ్, ఆంధ్ర వేదికగా బ్రిటిష్ వారిపై పోరాడిన అల్లూరి కలిసి పోరాటం చేస్తే ఎలా ఉంటుంది అనేది ఈ మూవీ కథాంశం అని రాజమౌళి ఇప్పటికే చెప్పడం జరిగింది. కాగా ఎన్టీఆర్ కొమరం భీం రోల్ చేస్తుండగా ఆయన చేత తెలంగాణ యాసలో డైలాగ్స్ పలికించనున్నాడు రాజమౌళి. ఇప్పటికే చరణ్ ఫస్ట్ లుక్ వీడియోలో ఆయన యాస ఎలా ఉండబోతుందో శాంపిల్ చూశాం. మరి అల్లూరిగా చేస్తున్న చరణ్ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అల్లూరి విశాఖ ప్రాంతానికి చెందినవాడు. అక్కడ ప్రాంత ప్రజలకు ప్రత్యేక యాస ఉంది. మరి ఎన్టీఆర్ తో తెలంగాణా డిలెక్ట్ ట్రై చేయించిన రాజమౌళి చరణ్ తో కూడా మన్యం ప్రజల భాషా మరియు యాసా శైలిని ట్రై చేస్తాడేమో చూడాలి. మరి ఈ విషయంపై స్పష్టత రావాలంటే మరికొంత కాలం ఆగాల్సిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: