ఎక్కువగా తమిళ సినిమాల్లో తక్కువగా తెలుగు సినిమాలలో నటించి పేరుప్రఖ్యాతలు సంపాదించిన సోనియా అగర్వాల్ ఛత్తీస్ఘడ్ లో జన్మించగా... ఆమె మాతృభాష పంజాబీ. నిజానికి ఆమెకు మంచి నటిగా గుర్తింపు తేవడానికి కారణం తమిళ డైరెక్టర్ సెల్వరాఘవన్ అని చెప్పవచ్చు. సెల్వరాఘవన్ గురించి చెప్పాలంటే ఎన్నో విశేషాలు ఉన్నాయి. తాను ప్రముఖ తమిళ నటుడు అయిన ధనుష్ కి అన్నయ్య. అందుకే తాను తన మొట్టమొదటి సినిమాలలో ధనుష్ ని నటింప చేశాడు. చిన్నతనంలో ఇతనికి రెటీనా కేన్సర్ రావడం తో ఒక కన్ను తొలగించాల్సి వచ్చింది. అందుకే తాను బయటకు వచ్చినప్పుడు ఎప్పుడూ కళ్ళద్దాలు పెట్టుకుంటాడు.

 


ఇకపోతే 2003లో విడుదలైన తన ఫస్ట్ సినిమా కాదల్ కొండేన్ లో పంజాబీ ముద్దుగుమ్మ సోనియా అగర్వాల్ ని కథానాయికగా నటింపచేసిన సెల్వరాఘవన్. ఈ సినిమాలో నటించినందుకు గాను సోనియా అగర్వాల్ కి మంచి గుర్తింపు లభించింది. ఆ తర్వాత 7 జీ రెయిన్ బో కాలనీ లో కూడా సోనియా అగర్వాల్ నే హీరోయిన్ గా తీసుకున్నాడు సెల్వరాఘవన్. నిజానికి తన కాలేజీ రోజుల్లో జరిగిన నిజమైన సంఘటన లను 7 జీ రెయిన్ బో కాలనీ లో చూపించాడు సెల్వరాఘవన్. 

 

ఆ తరువాత 2006 వ సంవత్సరం లో సోనియా అగర్వాల్ తో కలిసి ఏకంగా మూడు సినిమాలను తెరకెక్కించాడు. వాటిలో పుదుపేట్టై సినిమా రికార్డులను తిరగరాసింది. అలాగే సోనియా అగర్వాల్ పాపులారిటీ తారాస్థాయికి చేరుకుంది. ఆ సమయంలోనే సెల్వరాఘవన్, సోనియా అగర్వాల్ పెళ్లి చేసుకున్నారు. దాదాపు మూడు సంవత్సరాల పాటు సంసారం చేసిన వీళ్లిద్దరు పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నారు. ప్రస్తుతం సోనియా అగర్వాల్ సింగిల్ గానే ఉంది కానీ సెల్వరాఘవన్ మాత్రం గీతాంజలి అనే ఓ యువతిని పెళ్లి చేసుకున్నాడు. తెలుగులో స్ట్రెయిట్ గా ఆడవారి మాటలకు అర్థాలే వేరులే(2007) చిత్రాన్ని తెరకెక్కించి తెలుగు ప్రేక్షకులను బాగా ఎంటర్టైన్ చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: