తెలుగులో అయినా తమిళంలో అయినా సరే రమ్యకృష్ణ కు వచ్చిన పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందరో దర్శకుల సినిమాల్లో అగ్ర హీరోయిన్ గా నటించి తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకుంది. ఆమె సినిమాల కోసం యువత అప్పట్లో ఎక్కువగా ఎదురు చూసే వారు. ఆమె అందాలను దర్శకులు చూపించిన విధానం చూసి చాలా మంది ప్రేక్షకులు ఫిదా అయిపోయారు కూడా అప్పట్లో అనేది వాస్తవం. ఆమె సినిమాలకు దూరంగా ఉన్నా దగ్గరగా ఉన్నా సరే ప్రేక్షకులు మాత్రం ఆమెను ఎప్పుడు కూడా మర్చిపోయిన సందర్భం అనేది లేదు అనే చెప్పాలి. 

 

ఆమె సినిమాలు అనగానే ఒక రేంజ్ లో ఉంటాయి అనే గుర్తింపు ఉంది. ఆమె నటనకు మంచి గుర్తి౦పు ఉండేది. ఇక అది పక్కన పెడితే ఆమె అగ్ర దర్శకుల్లో రాఘవేంద్ర రావు దర్శకత్వంలో చాలా సినిమాలు చేసారు. ఆయన దర్శకత్వంలో ఆమె చేసిన సినిమాలు అన్నీ కూడా మంచి విజయం సాధించాయి . దాదాపు 20 సినిమాల్లో ఆమె హీరోయిన్ గా నటించారు. ఆమెను చిన్న వయసులో ఆయనే హీరోయిన్ ని కూడా చేసారు అనే విషయం అందరికి తెలిసిందే. ఆమెకు ఆయన ఇచ్చిన పాటలు గాని ఆమెకు సినిమాలో ఇచ్చిన ప్రాధాన్యత గాని ప్రత్యేకంగా చెప్పుకునే స్థాయిలోనే ఉంటుంది. 

 

ఆమె ఒకరకంగా చెప్పాలి అంటే స్టార్ హీరోయిన్ గా అయింది ఆయన సినిమాల తోనే అనే విషయం చాలా మందికి తెలుసు. ఆయన సినిమాల్లో ఆమె ఉండటం తో చాలా మంది హీరోయిన్ లు కూడా అప్పట్లో కుళ్ళుకున్నారని అంటారు కూడా. ఇక ఆమెకు కెరీర్  పరంగా ఆయన చాలా వరకు హెల్ప్ చేసారని ఆమెలో ఉన్న ప్రతిభ ను గుర్తించింది ఆయనే అని అంటూ ఉంటారు ఆమె అభిమానులు.

మరింత సమాచారం తెలుసుకోండి: