రాఘవేంద్ర రావు శ్రీదేవి... వీరి కాంబినేషన్ లో సినిమా వస్తుంది అంటే చాలు ప్రేక్షకులు సినిమా హాల్ కి పరుగులు తీసే వారు. వీరి కాంబినేషన్ లో వచ్చిన ఎన్నో సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. ఒక్క తెలుగులోనే కాదు తమిళంలో బాలీవుడ్ లో కూడా మంచి విజయాలు నమోదు చేసాయి. శ్రీదేవి సినిమాలు అనగానే ప్రేక్షకులు ఎంతో ఆశగా ఎదురు చూసే వారు. ఇక రాఘవేంద్ర రావు కాంబినేషన్ లో ఆమె సినిమా అంటే చాలు అభిమానులకు ఒకరకంగా పండగ అనే చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అయినా కిందటి తరం అయినా సరే వీరి కాంబినేషన్ లో సినిమా చూస్తే వదిలిపెట్టే అవకాశం ఉండదు. 

 

దేవత సినిమా లో శ్రీదేవి ని ఆయన చూపించిన విధానం చూసి విమర్శకులు కూడా షాక్ అయ్యారు. సాధారణంగా శ్రీదేవి కి ఉన్న ఇమేజ్ కి ఆమె నటించాల్సిన అవసరం లేదు. కాని శ్రీదేవి లో ఉన్న నటనను బయటకు తీసుకొచ్చారు. అప్పటికే శ్రీదేవి కి మంచి నటిగా పేరు ఉన్నా సరే ఆ సినిమా ద్వారా ఆమె స్థాయి మరో రేంజ్ కి వెళ్ళింది. గోదావరి తీరంలో ఒక పాటలో శ్రీదేవి నడుం చూసి ఇండియన్ సినిమా షేక్ అయింది. ఒక హేమ మాలిని ఒక శ్రీదేవి అనే రేంజ్ లో చెప్పుకున్నారు ప్రేక్షకులు. ఇక అతిలోక సుందరి జగదేక వీరుడు సినిమాలో అయినా సరే...

 

ఇక ఎన్టీఆర్ హీరో గా వచ్చిన అడవి రాముడు జస్టీస్ చౌదరి సినిమా ల్లో ఆమె నటన చూసి ఔరా అన్నారు విమర్శకులు కూడా. ఆ విధంగా శ్రీదేవి ఆయన తో చేసిన సినిమాలు అన్నీ కూడా వందల రోజులు ఆడాయి అనేది తెలిసిందే. ఆ విధంగా ఆ జోడి సూపర్ హిట్ అయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: