టాలీవుడ్ లో కొందరు హీరోయిన్ లు చరిత్రలో నిలిచిపోయారు. అందులో ప్రధానంగా చెప్పుకునే హీరోయిన్ ఎవరైనా ఉన్నారు అంటే ఈ తరంలో అనుష్క. ఒక హీరో కి వచ్చిన పాపులారిటి ఆమెకు వచ్చింది. ఒక హీరో కి వచ్చిన ఇమేజ్ ఆమెకు వచ్చింది. ఆమె సినిమాలు అనగానే  హాల్ కి వెళ్లి పని మానేసి చూసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇక ఆమెను చూపించిన కొందరు దర్శకులు అయితే ఆమెను చాలా అందంగా చూపించడమే కాదు ఆమె లో ఉన్న నటిని కూడా ప్రేక్షకులకు పూర్తి స్థాయిలో పరిచయం చేసారు అనేది వాస్తవం. 

 

ఇక అందులో ప్రధానంగా చెప్పుకునే దర్శకుడు క్రిష్. ఆమె తో వేదం అనే సినిమాలో క్రిష్ చేయించిన నటన చూసి ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ప్రతీ సీన్ లో కూడా ఆమె ఆ సినిమాలో వేశ్య పాత్రలో జీవించింది. వాస్తవానికి ఆ రేంజ్ లో నటించాలి అంటే హీరోయిన్ కి దమ్ము ఉండాలి. దమ్మున్న హీరోయిన్ అయితేనే ఆ స్థాయిలో నటిస్తుంది అనేది వాస్తవం. అప్పుడు అనుష్క స్టార్ హీరోయిన్. ఆమె వేశ్య పాత్రలో నటించడమే ఒక సంచలనం అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఇక దర్శకుడు క్రిష్ ఆమెను చాలా అందంగా చూపించడమే కాదు ఎక్కడా కూడా విమర్శలు  రాకుండా ఆమెను చూపించాడు అనే చెప్పుకోవచ్చు. 

 

ఇక ఆ సినిమాలో ఆమె నటనకు ఎన్నో అవార్డులు కూడా వచ్చాయి. సినిమా ఫ్లాప్ అయినా సరే ఆ సినిమాలో అనుష్క నటన ఒక రేంజ్ లో ఉందని ఎందరో కామెంట్ చేసారు. ఆమెకు ఏ అవార్డ్ ఇచ్చినా తక్కువే అనే విధంగా ఆమె నటించి మెప్పించింది. అయితే ఆమె పాత్రను ఆమె అభిమానులు చాలా మంది తట్టుకోలేకపోయారు అనేది అప్పట్లో వినపడింది.

మరింత సమాచారం తెలుసుకోండి: