టాలీవుడ్ లో బాహుబలి సినిమా ఒక సంచలనం అనే విషయం అందరికి తెలిసిందే. ఆ సినిమా ఏ స్థాయిలో విజయం సాధించింది అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రెండు భాగాలు కూడా చాలా బాగా ఆకట్టుకున్నాయి. ఇండియన్ సినిమాలో ఆ రెండు సినిమాలు కూడా వసూళ్లు కూడా ఒక రేంజ్ లో చేసి ఏ సినిమాకు అందని ఎత్తులో నిలిచాయి అనేది వాస్తవం. ఇక ఆ సినిమా ద్వారా ప్రభాస్ రానా అనుష్క వంటి వారు సూపర్ స్టార్ లు అయిపోయారు అనే చెప్పవచ్చు. ఇక అనుష్క కి అయితే నటిగా మంచి గుర్తింపు వచ్చింది ఆ సినిమా తో. 

 

ఇక ఆమె నటన విషయానికి వస్తే సినిమాలో ఆమె కాకుండా మరో హీరోయిన్ అయితే  ఏ మాత్రం కూడా సినిమా బాగుండే అవకాశం లేదని ఎందరో కామెంట్ చేసారు అప్పట్లో. ఇక ఆమె నటన తో పాటుగా ఆమెను దర్శకుడు రాజమౌళి చూపించిన విధానం కూడా ఎంతగానో ఆకట్టుకుంది ప్రేక్షకులను అనే చెప్పవచ్చు. ఆమె కొన్ని పాటల్లో చాలా  అందంగా కనపడింది. ఇక  కొన్ని సీన్స్ విషయానికి వస్తే దర్శకుడి ఆలోచనకు తగిన విధంగానే ఆమె నటించి మెప్పించింది. ప్రతీ సన్నివేశం కూడా ప్రేక్షకులను చాలా బాగా ఆకట్టుకుంది అనే చెప్పవచ్చు. 

 

మొదటి భాగంలో ఆమె తో ఉన్న కొన్ని సీన్లు ప్రేక్షకులకు ఇంకా గుర్తు ఉన్నాయి అని చెప్పవచ్చు. రెండో భాగంలో కూడా ఆమె నటనకు ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చాడు దర్శకుడు అనే చెప్పవచ్చు. ఆ విధంగా నటించారు ఆమె. ఇప్పుడు రెండు మూడు సినిమాల్లో అనుష్క నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆమె నటించిన ఒక సినిమా విడుదలకు నోచుకోలేదు. లాక్ డౌన్ కారణంగా ఆ సినిమా ఆగిపోయింది. మరి ఎప్పుడు వస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: