టాలీవుడ్ లో మహేష్ బాబు ఒక ట్రెండ్ ఎక్కువగా ఫాలో అవుతున్నాడు. అది ఏంటీ అంటే.... సినిమా మార్కెట్... అంటే సినిమా విడుదల అవక ముందు మార్కెట్ మొత్తం తాను తీసుకుని సినిమా విడుదల అయిన తర్వాత మార్కెట్ లో వేలు పెట్టకుండా సినిమాలు చెయ్యాలి అని ఫాలో అవుతున్నాడు. పారితోషికం తీసుకోకుండా నిర్మాతలకు ఇబ్బంది లేకుండా మహేష్ బాబు ఈ ప్లాన్ వేసాడు అని అంటున్నారు. వాస్త‌వంగా శ్రీమంతుడు సినిమా నుంచి మ‌హేష్ బాబు రెమ్యున‌రేష‌న్‌పై అనేక ర‌కాల చ‌ర్చ‌లు జ‌రుగుతూ వ‌స్తున్నాయి. మ‌హేష్ బాబు రెమ్యున‌రేష‌న్ తీసుకోవ‌డం లేద‌ని.. లేదా ఏరియా వైజ్ హ‌క్కులు కావాల‌ని అడుగుతున్నాడ‌ని.. లేదా నాన్ థియేట్రిక‌ల్ రైట్స్ అడుగుతున్నాడ‌ని ఇలా ర‌క‌ర‌కాల ప్ర‌చారాలు జ‌రుగుతూ వ‌స్తున్నాయి.

 

అయితే దీని వల్ల‌ నిర్మాతలు ఎక్కువగా నష్టపోయే అవకాశం ఉందనే ప్రచారం టాలీవుడ్ లో జరిగింది. స్టార్ హీరో మార్కెట్ అంటే చాలా వరకు జరుగుతుంది. దాదాపు వంద కోట్ల వరకు మార్కెట్ జరుగుతుంది. ఈ విషయం గురించి అందరికి తెలిసిందే. ఇప్పుడు ఆ మార్కెట్ మొత్తం హీరో తీసుకుంటే ఎలా అనేది చాలా మందిలో ఉన్న ఆలోచన. ఇక చిరంజీవి కూడా ఇదే విషయాన్ని ఫాలో అవుతున్నారు. 

 

సైరా సినిమాకు గానూ చిరంజీవి నిర్మాత రామ్ చరణ్ నుంచి ఇదే విధంగా వసూలు చేసారు. అసలే ఆ సినిమా నష్టాలు రావడం సినిమా ముందు మార్కెట్ మొత్తం చిరంజీవి తీసుకోవడం తో దాదాపు రు. 70 కోట్ల వరకు నిర్మాతకు నష్టం వచ్చింది. ఇప్పుడు ఇదే ఫార్ములాని ఆచార్య సహా తర్వాత వచ్చే లూసిఫర్ సినిమాకు కూడా ఫాలో అవ్వాలి అని చిరంజీవి భావించగా రామ్ చరణ్ వద్దు అన్నాడని పారితోషికమే తీసుకోవాలని చెప్పాడట. ఇక ఆచార్య సినిమాకు కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌గా ఈ సినిమాను వ‌చ్చే యేడాది ప్రేక్ష‌కుల ముందుకు తీసుకు రానున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: