తెలుగు చిత్ర పరిశ్రమలో దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు ఎన్నో విజయవంతమైన సినిమాలను తెరకెక్కించి సాదా సీదా హీరోలను స్టార్ హీరోయిన్ గా మార్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం స్టార్ హీరోలుగా కొనసాగుతున్న ఎంతో మంది హీరోలు అప్పట్లో దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు సినిమాతో తమ ప్రస్థానాన్ని ప్రారంభించిన వాళ్లే. ఇలా ఎంతో మంది హీరోలను స్టార్ హీరోల రేంజ్ తీసుకువచ్చారు దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు. తెలుగు చిత్ర పరిశ్రమ అనే పుస్తకంలో ఎన్నో పేజీలు లిఖించుకున్నాడు రాఘవేంద్రరావు. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ అందరిని ఆకట్టుకునే విధంగా సినిమాలను తెరకెక్కిస్తూ  ఉంటారు. అయితే దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు సినిమాలో హీరోయిన్ లకు ఎంతో ప్రాధాన్యత ఉంటుందో  ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 

 


 ముఖ్యంగా హీరోయిన్లను అందంగా చూపించడంలో దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు కి  ఎవరు సాటి రారు అనే  చెప్పాలి. ఓవైపు తెలుగుతనం ఉట్టిపడుతూ మరోవైపు అందాల దేవత గా ప్రేక్షకులను మెస్మరైజ్ చేసే విధంగా సినిమాల్లో హీరోయిన్లను చూపిస్తూ ఉంటారు దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు. ఇక ఇప్పటి వరకూ చాలామంది హీరోయిన్లను తన సినిమాల్లో అందాల దేవత గా చూపించి ప్రేక్షకుల మతి పోగొట్టాడు అని చెప్పాలి . అయితే ఇలా దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తెరకెక్కించిన సినిమాలలో ఎక్కువ సార్లు రిపీట్ అయిన హీరోయిన్ మాత్రం రమ్యకృష్ణ. అప్పట్లో రమ్యకృష్ణ కె.రాఘవేంద్రరావు కాంబినేషన్ ప్రేక్షకులకు ఫేవరేట్ గా మారిపోయింది . 

 


 ఇక రమ్యకృష్ణ కె.రాఘవేంద్రరావు కాంబినేషన్లో ఎన్నో సినిమాలు తెరకెక్కాయి. దర్శకేంద్రుడు తన సినిమాలో రమ్యకృష్ణ ను హీరోయిన్ గా తీసుకొని రమ్యకృష్ణను  మరింత అందంగా చూపించడానికి ఎక్కువగా ఇష్టపడే వారట . అప్పట్లో దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు.. రమ్యకృష్ణ కు సంబంధించి ఎన్నో వార్తలు కూడా హల్ చల్ చేసిన విషయం తెలిసిందే. ఇక దర్శకేంద్రుడు సినిమాలలో ఎక్కువ సార్లు రిపీట్ అయితే హీరోయిన్ లలో రమ్యకృష్ణ మొదటి స్థానంలో ఉంటుంది అనడంలో అతిశయోక్తి లేదు. దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు తెరకెక్కించిన ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించిన రమ్యకృష్ణ స్టార్ హీరోయిన్ రేంజికి ఎదిగి పోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: